Pope Francis-LGBT People : స్వలింగ సంపర్కులకూ చర్చి తలుపులు తెరిచే ఉన్నాయ్.. కానీ : పోప్ ఫ్రాన్సిస్
Pope Francis-LGBT People : స్వలింగ సంపర్కులకు సంబంధించి పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. "స్వలింగ సంపర్కులు సహా అందరికీ.. ప్రతి ఒక్కరికీ చర్చి తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి" అని ఆయన స్పష్టం చేశారు.
- Author : Pasha
Date : 07-08-2023 - 8:03 IST
Published By : Hashtagu Telugu Desk
Pope Francis-LGBT People : స్వలింగ సంపర్కులకు సంబంధించి పోప్ ఫ్రాన్సిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. “స్వలింగ సంపర్కులు సహా అందరికీ.. ప్రతి ఒక్కరికీ క్యాథలిక్ చర్చి తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి” అని ఆయన స్పష్టం చేశారు. స్త్రీలు, స్వలింగ సంపర్కులు వంటి కొందరికి చర్చిలో ఒకే విధమైన హక్కులు లేవు కదా అని ఓ మీడియా ప్రతినిధి పోప్ ఫ్రాన్సిస్ ను ప్రశ్నించగా.. “చర్చి అందరికీ తెరిచి ఉంటుంది. అయితే చర్చి లోపల కార్యక్రమాలను, కార్యకలాపాలను నియంత్రించే, నిర్వహించే కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటి ప్రకారం.. వారు కొన్ని మత కార్యకలాపాల్లో పాలుపంచుకోలేరు. అంతమాత్రాన వాళ్లు చర్చిలోకి వచ్చే మార్గం మూసుకుపోయిందని అర్థం కాదు. ప్రతి వ్యక్తి చర్చి లోపలికి వచ్చి దేవుణ్ణి ప్రార్ధించవచ్చు” అని వివరించారు.
Also read : Moon Images-Chandrayaan3 : మన “చంద్రయాన్” పంపిన చందమామ వీడియో
“చర్చిల నిర్వాహకులు.. దేవుని ప్రార్ధన కోసం చర్చికి వచ్చే వారిపై తల్లి లాంటి ప్రేమను చూపాలి. ఒకవేళ వారు చర్చిలో నిబంధనలను పాటించకున్నా సహనంతో ప్రవర్తించాలి”అని పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis-LGBT People) సూచించారు. పోర్చుగల్ నుంచి రోమ్‌కు తిరిగి వస్తుండగా విమానంలో 86 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ విలేకరులతో మాట్లాడారు. జూన్‌లో ఉదర హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్న పోప్ ఫ్రాన్సిస్ .. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ఉదర కండరాలు బలపడే వరకు మరో రెండు లేదా మూడు నెలల పాటు పొత్తికడుపుపై బ్యాండ్ ను ధరించాల్సి ఉందన్నారు.