HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Pakistan Hospital Keeps Dead Body In Icu For Money Scandal

Shocking: ఒక మృతదేహాన్ని ఐసీయూ‌లో ఉంచి లక్షలు వసూలు..?

Shocking: పాకిస్థాన్‌లోని అత్యంత ప్రసిద్ధిగా చెప్పుకునే ఇస్లామాబాద్‌లోని పిమ్స్ (PIMS) హాస్పిటల్‌ తాజాగా అమానుష ఆరోపణలతో తీవ్ర దుమారం రేపుతోంది.

  • By Kavya Krishna Published Date - 05:44 PM, Mon - 7 July 25
  • daily-hunt
Lady Constable Suicide With SI
Lady Constable Suicide With SI

Shocking: పాకిస్థాన్‌లోని అత్యంత ప్రసిద్ధిగా చెప్పుకునే ఇస్లామాబాద్‌లోని పిమ్స్ (PIMS) హాస్పిటల్‌ తాజాగా అమానుష ఆరోపణలతో తీవ్ర దుమారం రేపుతోంది. డబ్బు కోసం ఒక రోగి మృతి చెందిన తర్వాత కూడా ఆయన శవాన్ని ఐసీయూ‌లో ఉంచి, ఏకంగా ఏడు రోజుల పాటు కుటుంబసభ్యుల వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అసెంబ్లీ కమిటీ వేదికగా బయటపడ్డ దారుణం
ఈ విషయాన్ని ఇటీవల జరిగిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆరోగ్య ఉపసంఘం సమావేశంలో కమిటీ సభ్యురాలు షైస్తా ఖాన్ బయటపెట్టారు. ఆమె ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక రోగి మరణించాడు. కానీ ఆసుపత్రి యాజమాన్యం ఆ మృతదేహాన్ని వెంటిలేటర్‌పై ఉంచి, మృతుడి కుటుంబసభ్యులకు అది తెలియనివ్వకుండా రోజుకు లక్ష రూపాయల చొప్పున మొత్తం ఏడు లక్షలు వసూలు చేసినట్లు షైస్తా ఖాన్ ఆరోపించారు.

Hyderabad : విద్యా వాగ్దానాలు వృథా…ఇంకా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు !

నైతిక పతనం, పర్యవేక్షణ లోపం
ఈ ఆరోపణలు ప్రైవేట్ వైద్య రంగంలో పర్యవేక్షణ లోపాలను, వ్యాపార లక్ష్యాల కోసం నైతిక విలువలను ఎలా తుంగలో తొక్కుతున్నారో చూపిస్తున్నాయి. ఆసుపత్రులు రోగులకు చికిత్స ఇవ్వాల్సిన స్థలాలు కావాలే గానీ, లాభాల కోసమే పనిచేసే కేంద్రాలుగా మారిపోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ అవి పూర్తిగా నిరాధారమని ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆసుపత్రిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సమగ్ర విచారణపై డిమాండ్లు
ఈ అమానుష ఘటనపై నెటిజన్లతోపాటు సామాన్య ప్రజానీకం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలనీ, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని పలువురు నేతలు కూడా కోరుతున్నారు.

Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కీలక మలుపు..నేరం అంగీకరించిన తహవ్వూర్ రాణా…


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICU Abuse Case
  • ICU Dead Body
  • Medical Ethics Violation
  • Medical Malpractice Pakistan
  • Pakistan Health Committee
  • Pakistan Hospital Scandal
  • PIMS Islamabad
  • Private Hospital Controversy
  • Shaista Khan
  • Viral News Pakistan

Related News

    Latest News

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd