Toshkhana Case : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అనర్హత వేటు..!!
తోషేఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసింది. ఈసీపీ ఈ కేసులో తన తీర్పును వెల్లడించింది.
- By hashtagu Published Date - 03:15 PM, Fri - 21 October 22

తోషేఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసింది. ఈసీపీ ఈ కేసులో తన తీర్పును వెల్లడించింది. పీటీఐ అధ్యక్షుడు ఇకపై జాతీయ అసెంబ్లీలో సభ్యుడు కాదని పేర్కొంది. ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ప్రాంతంలో శాంతిభ్రదత ల ద్రుష్ట్యా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారిని నియమించింది. దాదాపు 11వందల మందికిపై పోలీసు సిబ్బంది మోహరించారు.
ఇస్లామాబాద్లోని సెక్రటేరియట్ లో కమిషన్ ఎదుట హాజరుకావాలని అన్నిపార్టీలు లేదా వారి న్యాయవాదులను ఆదేశిస్తూ ఈసీ నోటీసు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఈసీ తోషేఖానా కేసులో నిర్ణయాన్ని సెప్టెంబర్ 19న రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజా నేత్రుత్వంలోని ఐదుగురు సభ్యుల ఈసీపీ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది.