Imran Vs Nawaz : ఇమ్రాన్ వర్సెస్ నవాజ్.. పోటాపోటీగా గెలుపు ప్రసంగాలు.. చేయి కలిపిన నవాజ్, భుట్టో
Imran Vs Nawaz : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది.
- By Pasha Published Date - 07:53 AM, Sat - 10 February 24

Imran Vs Nawaz : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. జైలులో ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలోకి దిగి విజయఢంకా మోగించారు. కడపటి వార్తలు అందే సమయానికి పాక్‌లోని మొత్తం 265 జాతీయ అసెంబ్లీస్థానాలకుగానూ 250 స్థానాల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మరో 15 స్థానాల ఫలితాలే రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పటివరకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేసి అత్యధికంగా 97 స్థానాల్లో బంపర్ విక్టరీ సాధించారు. మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్ -ఎన్) పార్టీ సీట్లపరంగా రెండో ప్లేస్‌లో నిలిచింది. దీనికి 72 సీట్లు వచ్చాయి. బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి 52 సీట్లు వచ్చాయి. ఎంక్యూఎం – పీ అనే మరో పార్టీకి 15 సీట్లు వచ్చాయి. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు 9 చోట్ల నెగ్గారు. కాగా, తోషాఖానా సహా వివిధ కేసుల్లో జైలు శిక్ష పడటంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌పై ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాలతో ఆ పార్టీ గుర్తు బ్యాట్ కూడా రద్దైంది. దీంతో పీటీఐ అభ్యర్థులు వివిధ గుర్తులతో స్వతంత్రంగానే పోటీ చేశారు.
قوم کی جانب سے انتخابات میں تاریخی مقابلے، جس کے نتیجے میں تحریک انصاف کو عام انتخابات 2024 میں بے مثال کامیابی میسرآئی،کے بعد چیئرمین عمران خان کا(مصنوعی ذہانت سے تیار کردہ) فاتحانہ خطاب pic.twitter.com/8yQqes4nO9
— Imran Khan (@ImranKhanPTI) February 9, 2024
We’re now on WhatsApp. Click to Join
మ్యాజిక్ ఫిగర్ ఎంత ?
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉండగా.. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో 265 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పరచాలంటే 133 సీట్లు కావాలి. నవాజ్ షరీఫ్ పార్టీకి తగిన మెజారిటీ రాలేదు. దీంతో భుట్టో పార్టీతో చేయి కలిపేందుకు రెడీ అయ్యారు. నవాజ్ షరీఫ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, కో చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ లాహోర్‌లో సమావేశమయ్యారు. సంకీర్ణ సర్కారు(Imran Vs Nawaz) ఏర్పాటు చేయాలని వారు డిసైడయ్యారు.
నవాజ్ తెలివి తక్కువ దద్దమ్మ : ఇమ్రాన్
ఈ ఫలితాల నేపథ్యంలో మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ శనివారం తన AI- ఎనేబుల్డ్ వాయిస్‌లో ‘విజయ ప్రసంగం’ విడుదల చేశారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అధినేత నవాజ్ షరీఫ్ ‘లండన్ ప్లాన్’ విఫలమైందని విరుచుకుపడ్డారు. పోలింగ్ రోజున భారీ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చారని చెప్పారు. ‘‘నా ప్రియమైన దేశప్రజలారా. ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని మీ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం ద్వారా పౌరుల హక్కులను వినియోగించుకునే స్వేచ్ఛను పునరుద్ధరించడానికి మీరు పునాది వేశారు. ఎన్నికల్లో అద్భుతంగా గెలుపొందడంలో మాకు సహాయపడినందుకు మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. మీ ఓట్లు వేయడానికి మీరు పెద్ద సంఖ్యలో తరలి రావడంపై పూర్తి విశ్వాసం ఉంది. మీరు నా నమ్మకాన్ని నిలబెట్టారు. ఎన్నికల రోజున భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రజాస్వామ్య కసరత్తులో మీరు చురుకుగా పాల్గొనడం వల్ల ‘లండన్ ప్లాన్’ ఫెయిల్ అయింది. 30 సీట్లు వెనుకంజలో ఉన్నా విజయ ప్రసంగం చేసిన తెలి తక్కువ దద్దమ్మ నవాజ్ షరీఫ్’’ అని ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో తన AI- వాయిస్‌తో కూడిన ఆడియో క్లిప్‌లో తెలిపారు. ‘‘ఫామ్ 45 డేటా ప్రకారం.. మేం 170 కంటే ఎక్కువ సీట్లను గెలవబోతున్నాం. నా తోటి ప్రజలారా, మీరంతా పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఒక తేదీని నిర్ణయించుకున్నారు. 2024 ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో గెలుస్తున్నాం.. ప్రతి ఒక్కరూ మీ ఓటు శక్తిని చూశారు. ఇప్పుడు మీ సత్తా చూపండి.. దాన్ని సంరక్షించండి.. రక్షించండి’’ అని ఇమ్రాన్ చెప్పారు.
Also Read : Ram Temple: నేడు పార్లమెంట్‌లో అయోధ్య రామ మందిరంపై చర్చ..?
అతిపెద్ద పార్టీ మాదే : నవాజ్ షరీఫ్
జాతీయ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా పీఎంఎల్-ఎన్ అవతరిస్తుందని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ముందుకు రావాలంటూ వివిధ రాజకీయ పక్షాలకు ఆయన పిలుపునిచ్చారు. పీటీఐ పార్టీ మాత్రం.. తాము ఎవరితోనూ జత కట్టబోమని.. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసింది. రెండు స్థానాల నుంచి పోటీ చేసిన షరీఫ్.. లాహోర్ నుంచి నెగ్గారు. మన్సెహరాలో ఓడిపోయారు.
పార్టీ | నేషనల్ అసెంబ్లీ | పంజాబ్ అసెంబ్లీ | సింధ్ అసెంబ్లీ | బెలూచిస్తాన్ అసెంబ్లీ | కేపీ అసెంబ్లీ |
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) | 52 | 10 | 82 | 9 | 4 |
పీటీఐ – స్వతంత్రులు | 97 | 116 | 12 | 0 | 79 |
బీఎన్‌పీ పార్టీ | 2 | 0 | 0 | 1 | 0 |
పీఎంఎల్ – నవాజ్ | 72 | 134 | 0 | 9 | 5 |
ఎంక్యూఎం-పీ | 15 | 0 | 24 | 0 | 0 |
జేయూఐ-ఎఫ్ | 3 | 0 | 1 | 8 | 8 |
ఏఎన్‌పీ | 0 | 0 | 0 | 0 | 0 |
జేఐ | 0 | 0 | 2 | 1 | 3 |
టీఎల్‌పీ | 0 | 1 | 0 | 0 | 0 |
ఐపీపీ | 2 | 1 | 0 | 0 | 0 |
స్వతంత్రులు | 9 | 23 | 3 | 5 | 7 |