Nigeria Boat Accident :వరదల నుంచి ప్రజలను సురక్షితంగా తీసుకెళ్తున్న పడవ బోల్తా…76 మంది మృతి..!!
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ భారీ వర్షాలు పడుతుండటంతో...చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.
- By hashtagu Published Date - 07:52 AM, Mon - 10 October 22

నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ భారీ వర్షాలు పడుతుండటంతో…చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షితంగా తీసుకుని వస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 76మంది మరణించారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం… అంబారా రాష్ట్రంలో ఆదివారం ఓ పడవ కూలిపోయింది. వరదల్లో చిక్కుకున్న 85 మందిని రక్షించేందుకు ఈ బోటు వచ్చింది. వరదల కారణంగా పడవలో 85 మంది ప్రయాణిస్తుండగా…బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కనీసం 76 మంది మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు.
నైజీరియా అధ్యక్షుడు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దేశంలోని ఓగ్‌బారు ప్రాంతంలో వరదలు పెరగడంతో 85 మంది ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడిందని.. 76 మంది మరణించినట్లు తెలిపారు. ప్రమాద వార్త తెలియగానే నైజీరియా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
The death toll from a boat accident in Nigeria's southeastern state of Anambra has risen to 76, said the president. The vessel capsized on Friday amid heavy flooding in the Ogbaru area of Anambra: Reuters
— ANI (@ANI) October 9, 2022