Afghan Earthquake : 1,400 మందికిపైగా మృతి
Afghan Earthquake : స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 1,411 మంది మృతిచెందగా, 3,124 మంది తీవ్రంగా గాయపడ్డారు
- By Sudheer Published Date - 07:21 PM, Tue - 2 September 25

అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంపం (Afghan Earthquake) భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలకు దారితీసింది. స్థానిక అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 1,411 మంది మృతిచెందగా, 3,124 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆకస్మికంగా సంభవించిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇళ్లకు బదులు శిథిలాలు మాత్రమే మిగలడంతో ప్రజలు ఆందోళనలో మునిగిపోయారు.
Milk and Ghee : రాత్రి పాలలో నెయ్యి వేసుకుని తింటే ఏం జరుగుతుందో తెలుసా? అన్ని సమస్యలు దూరం!
అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం సుమారు 5,412 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నేలమట్టమయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వైద్య సౌకర్యాలు తగిన స్థాయిలో లేవు కాబట్టి సహాయక చర్యలు మందగించడం వల్ల మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం కునార్ ప్రావిన్స్‌లోని ఆసదాబాద్, నుర్గల్, చొకే, వాటాపూర్ జిల్లాల్లో విపత్తు తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఆహారం, నీరు, ఔషధాలు వంటి మౌలిక సదుపాయాల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయ సహాయం అత్యవసరం అని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ విపత్తు అఫ్గానిస్థాన్ ప్రజల జీవన విధానంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశముంది.