Philippines Floods: ఫిలిప్పీన్స్‌లో తుఫాను.. 100 మంది మృతి, 51 మంది గల్లంతు
శిథిలాలను తొలగించే క్రమంలో పలుచోట్ల డెడ్‌బాడీస్(Philippines Floods) బయటపడ్డాయి.
- Author : Pasha
Date : 27-10-2024 - 12:49 IST
Published By : Hashtagu Telugu Desk
Philippines Floods : ఫిలిప్పీన్స్‌ను విధ్వంసకర ట్రామీ తుఫాను వణికిస్తోంది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 100కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగేే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో 51 మంది గల్లంతయ్యారు. తప్పిపోయినవారి కోసం అధికారులు వెతుకుతున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ వర్క్స్ జరుగుతున్నాయి.
Also Read :Salman Khan : లారెన్స్ గ్యాంగ్ ఏదైనా చేస్తుందేమో.. సల్మాన్ సారీ చెప్పుకో : రాకేశ్ టికాయత్
వరద ప్రభావిత ప్రాంతాలను ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ సందర్శించారు. రెండు నెలల్లో కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే కురవడంతో దేశంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయని ఆయన తెలిపారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద ఉద్ధృతి ఎక్కువగానే ఉందని ఫెర్డినాండ్ మార్కోస్ వెల్లడించారు.
Also Read :QR Coin Machine : క్యూఆర్ కోడ్‌తో స్కాన్ కొట్టు.. చేతి నిండా చిల్లర పట్టు
50 లక్షల మందికిపైగా ఫిలిప్పీన్స్ ప్రజలు తుఫాను వల్ల ప్రభావితులు అయినట్లు తెలిసింది. దాదాపు 5లక్షల మంది వరద సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ తుఫాను వల్ల పలు ప్రాంతాల్లో దాదాపు 11 అడుగుల మేర బురద మట్టి పేరుకుపోయింది. బండరాళ్లు, శిథిలాలు, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టల్లా పోగయ్యాయి. వాటిని తొలగించేందుకు ప్రత్యేక పారిశుధ్య టీమ్స్ పనిచేస్తున్నాయి. శిథిలాలను తొలగించే క్రమంలో పలుచోట్ల డెడ్‌బాడీస్(Philippines Floods) బయటపడ్డాయి.
Also Read :Rave Party at Janwada Farm House : రేవ్ పార్టీనా? రావుల పార్టీనా? – ఎంపీ రఘునందన్
ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం మధ్య ఉంది. ఇందువల్లే ఇక్కడ ఏటా 20 తుఫానులు వస్తుంటాయి.వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటారు. 2013లో ఈ దేశంలో సంభవించిన హైయాన్ తుఫాను వల్ల 7వేల మంది చనిపోయారు. ఈ ఏడాది ఫిలిప్పీన్స్‌లో 11 తుఫానులు సంభవించాయి. ఈ తుఫాను వియత్నాం దేశం వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నారు.