Facebook: ఫేస్ బుక్ అకౌంట్ లాక్ పై కోర్టుని ఆశ్రయించిన వ్యక్తి.. రూ.41 లక్షల పరిహారం?
ప్రస్తుత రోజుల్లో చాలామంది అనేక రకాల సోషల్ మీడియా యాప్స్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాషతో సంబంధం లేకుండా ఎక్కువ శాతం మంది వినియ
- By Nakshatra Published Date - 05:30 PM, Fri - 16 June 23
ప్రస్తుత రోజుల్లో చాలామంది అనేక రకాల సోషల్ మీడియా యాప్స్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాషతో సంబంధం లేకుండా ఎక్కువ శాతం మంది వినియోగిస్తున్న యాప్ ఫేస్బుక్. మామూలుగా ఈ ఫేస్బుక్ యాప్ కొన్ని కొన్ని సార్లు లాక్ పడుతూ ఉంటుంది.. అటువంటి సమయంలో ఫేస్బుక్ కి రిపోర్ట్ చేసి వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఫేస్బుక్ వారు స్పందించకపోవడంతో చాలామంది చిర్రెత్తుకొచ్చి వేరే ఫేస్బుక్ అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు.. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తన ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయినందుకు కోర్టును ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ ఘటన అమెరికాలోని జార్జియాలో జరిగింది.
జార్జియాకు చెందిన క్రాఫోర్డ్ ఒక సారి పొలిటికల్ కామెంట్ చేశాడన్న కారణంతో ఫేస్బుక్ అతడిని హెచ్చరించింది. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఉదయం ఫేస్బుక్ తెరుద్దామని చూస్తే అకౌంట్ లాక్ చేసినట్లు చూపించింది. ఎందుకు లాక్ చేశారన్న దానిపై ఫేస్బుక్ అతడికి ఎలాంటి వివరణా ఇవ్వలేదు. పోని సమస్యను పరిష్కరించుకుందామంటే ఎవరూ అందుబాటులోకి రాలేదు. తన అకౌంట్‌ను పునరుద్ధరించుకోవడానికి అప్పటిదాకా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడికి పట్టరాని కోపం వచ్చింది. దాంతో స్వతహాగా లాయర్ అయిన క్రాఫోర్డ్ ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటాపై న్యాయపోరాటానికి దిగాడు.
అకౌంట్‌ను లాక్ చేయడంపై 2022 ఆగస్టులో కోర్టులో దావా వేశాడు. ఎలాంటి ఉల్లంఘనా లేకపోయినా తన అకౌంట్‌ను ఫేస్బుక్ లాక్ చేసిందని ఆరోపించాడు. తాను అప్లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలను తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన పిటిషన్లో పేర్కొన్నాడు. దావా వేసినా ఫేస్బుక్ లీగల్ టీమ్ స్పందించలేదు. ఈ చర్య న్యాయమూర్తికి సైతం కోపం తెప్పించింది. దాంతో 50 వేల డాలర్లు అనగా భారత కరెన్సీ ప్రకారం రూ.41 లక్షలు చెల్లించాలని మెటాను ఆదేశించారు. ఇక న్యాయస్థానం ఆదేశాలపై వెంటనే స్పందించిన మెటా క్రాఫోర్డ్ ఫేస్బుక్ అకౌంట్‌ను పునరుద్ధరించింది. పరిహారం కోసం తాను దావా వేయలేదని, వినియోగదారుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించకూడదన్న ఉద్దేశంతోనే వేసినట్లు క్రాఫోర్డ్ పేర్కొన్నారు. అయితే, ఈ వ్యవహారం అప్పుడే తేలిపోలేదు. తన అకౌంట్‌ను పునరుద్ధరించినప్పటికీ న్యాయస్థానం ఆదేశించిన పరిహారంలో ఒక్క డాలరు కూడా తనకు చెల్లించలేదని క్రాఫోర్డ్ పేర్కొన్నారు. న్యాయస్థానం ఆదేశాలను ఫేస్బుక్ పెడచెవిన పెట్టిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై ఫేస్బుక్ ఇప్పటి వరకు స్పందించలేదు.
Related News
Instagram Down: మరోసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్లో ఫిర్యాదులు..!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ (Instagram Down) అయినట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది.