Belarus Nuclear Weapons : ఓవర్ యాక్షన్ చేస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం.. నాటోకు బెలారస్ వార్నింగ్
Belarus Nuclear Weapons : తమ దేశ సరిహద్దుల్లో నాటో (NATO) సైన్యాలు ఓవర్ యాక్షన్ చేస్తే అణ్వాయుధాలను ప్రయోగించడానికీ సిద్ధమేనని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ప్రకటించారు.
- By Pasha Published Date - 05:36 PM, Fri - 18 August 23

Belarus Nuclear Weapons : తమ దేశ సరిహద్దుల్లో నాటో (NATO) సైన్యాలు ఓవర్ యాక్షన్ చేస్తే అణ్వాయుధాలను ప్రయోగించడానికీ సిద్ధమేనని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ప్రకటించారు. ఉక్రెయిన్ సేనలు సరిహద్దు గీతను దాటి బెలారస్ వైపునకు వస్తే తప్ప.. తమ దేశం యుద్ధానికి దిగదని తేల్చి చెప్పారు. ఒక దేశాన్ని భయపెట్టడానికి తాము ఇక్కడ అణ్వాయుధాలను తీసుకురాలేదని తేల్చి చెప్పారు. తమకు రష్యా అందించిన అణ్వాయుధాలను దేశ రక్షణ కోసం మాత్రమే వాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తమపై దాడికి తెగబడేవారికి గుణపాఠం చెప్పేందుకే అవి పరిమితమని లుకషెంకో తెలిపారు.
Also read : Congress to BRS : బీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి? కాంగ్రెస్ కు జలక్!
ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూభాగాలతో ముడిపడిన అన్ని సమస్యల పరిష్కారానికి ఉక్రెయిన్, రష్యా కలిసికట్టుగా చొరవ చూపాలని(Belarus Nuclear Weapons) లుకషెంకో కోరారు. వాగ్నర్ గ్రూప్ కు చెందిన 10వేల మంది కిరాయి సైనికులను బెలారస్ ఇటీవల పోలాండ్ సరిహద్దుల్లో మోహరించిందనే వార్తలు వచ్చాయి. దీనికి కౌంటర్ గా పోలాండ్ కూడా పెద్దఎత్తున ఆర్మీని బెలారస్ బార్డర్ కు పంపిందని అంటున్నారు. ఈ తరుణంలోనే అణ్వాయుధాల వినియోగంపై లుకషెంకో వార్నింగ్ ఇచ్చారు.
Also read : Pakistan: ఇదేందయ్యా ఇది.. భర్త తీవ్రవాది.. భార్య పాక్ కేంద్ర మంత్రి?