UK: రిషి సునక్ చరిత్ర క్రియేట్ చేస్తాడా? బోరిస్ తిరిగి వస్తాడా? బ్రిటన్ ప్రధాని రేసులో ఏడుగురు..!!
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. అక్టోబర్ 28నాటికి బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోవల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు బ్రిటన్ లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనలో ఇప్పుడొక్క పెద్ద ట్విస్ట్ నెలకొంది.
- By hashtagu Published Date - 05:01 AM, Fri - 21 October 22
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. అక్టోబర్ 28నాటికి బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోవల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు బ్రిటన్ లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనలో ఇప్పుడొక్క పెద్ద ట్విస్ట్ నెలకొంది. ప్రధాని లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లోనే ప్రధానమంత్రికి రాజీనామా చేశారు. ఆమె ఆర్థిక విధానాలకు సొంత పార్టీలోనే వ్యతిరేక మొదలైంది. ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు అంటే టోరీ సభ్యులు కూడా తప్పుకున్నారు.
ఇప్పుడు లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత బ్రిటన్ మళ్లీ అదే పరిస్థితిని ఎదుర్కోబోతోంది. దానికి ముందు తర్వాత ప్రధాని ఎవరు అనే ప్రశ్న మొదలైంది. భారత సంతతికి చెందిన రిషి సునక్ పేరు బలంగా వినిపిస్తోంది. యూకే ప్రధాని రేసులో ఆయన ఉన్నారు. లిజ్ ట్రస్ రాజీనామా సునక్ కు సువర్ణావకాశం లాంటిది. కానీ అతనితోపాటు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఇతరులు కూడా ఈ రేసులో ఉండటంతో అంత సులభం కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: Revanth Emotional: నన్ను ఒంటరిని చేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్!
బ్రిటీష్ స్థానిక మీడియా ప్రకారం…ప్రధాని రేసులో చాలా మంది ఉన్నారు. మొదటి పేరు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్. రెండవ పేరు భారతీయ సంతతికి చెందిన రిషి సునక్. వీరితోపాటు పెన్నీ మోర్డాంట్ కూడా రేసులో ఉండనున్నాడు. మొత్తం ప్రధాని రేసులో 7గురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ముగ్గురికి మించి అభ్యర్థులు పోటీ చేయడం కష్టం. ఎందుకంటే బ్రిటిష్ పార్లమెంట్లో మొత్తం 357 మంది కన్సర్వేటివ్ పార్టీ ఎంపీలు ఉన్నారు. బ్యాలెట్ స్వీకరించడానికి అభ్యర్థికి దాదాపు 100మంది టోరీ చట్టసభ సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. కాబట్టి అభ్యర్థుల సంఖ్య ముగ్గురికి మించకూడదు.
రిషి సునక్:
ట్రస్ రాజీనామా తర్వాత మాజీ ఛాన్సలర్ రిషి సునక్ మళ్లీ బ్రిటన్ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉంది. భారత సంతతికి చెందిన సునక్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తికి అల్లుడు. బ్రిటన్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2015లో తొలిసారిగా రిషి సునక్ ఎంపీ అయినప్పుడు భగవద్గీతపై ప్రమానం చేశారు. రిషి సునక్ గెలిస్తే..అతను యూకే ప్రధాని అయిన భారత సంతతికి చెందిన మొదటి వ్యక్తి అవుతాడు. ఇది చారిత్రాత్మకం అవుతుంది.
Also Read: NewYork : వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ లో దీపావళి పబ్లిక్ హాలిడే..!!
Related News
Rishi Sunak- PM Modi: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో ఫోన్ లో మాట్లాడిన మోదీ..!
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak- PM Modi)తో టెలిఫోన్లో మాట్లాడారు.