Lebanon History : లెబనాన్ దేశం ఒకప్పుడు ఎలా ఉండేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు
షియాల ప్రాబల్యం అధికంగా ఉండే కొన్ని ఏరియాలపై హిజ్బుల్లాకు(Lebanon History) పూర్తి పట్టు ఉంది.
- By Pasha Published Date - 07:25 PM, Wed - 25 September 24

Lebanon History : ఇజ్రాయెల్ పొరుగుదేశం లెబనాన్ ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. ఇజ్రాయెల్ ఆర్మీ గత కొన్ని రోజులుగా జరుపుతున్న దాడుల్లో ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. వేలాది మంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారు. హిజ్బుల్లా అనే మిలిటెంట్ సంస్థకు లెబనాన్ కేంద్రం. ఆ దేశంలో హిజ్బుల్లా మిలిటెంట్లకు ఒక రాజకీయ పార్టీ కూడా ఉంది. షియాల ప్రాబల్యం అధికంగా ఉండే కొన్ని ఏరియాలపై హిజ్బుల్లాకు(Lebanon History) పూర్తి పట్టు ఉంది. కట్ చేస్తే….20 శతాబ్దంలో లెబనాన్ దేశం ఎలా ఉండేదో తెలిస్తే మీరు ఆశ్చర్యపోక మానరు. వివరాలివీ..
Also Read :Rahul Gandhi : ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు..? బిజెపి ఎంపీనా..? లేక మోడీనా..?: రాహుల్ గాంధీ
లెబనాన్ దేశం.. బీరుట్ నగరం విశేషాలివీ..
- మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఒకప్పుడు ఎంతో రిచ్ దేశం లెబనాన్.
- 16వ శతాబ్దం నుంచి లెబనాన్ దేశం అనేది టర్కీకి చెందిన ఒట్టోమాన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
- ఒట్టోమాన్ సామ్రాజ్యం పతనం అయ్యాక.. 20వ శతాబ్దం ప్రారంభంలో లెబనాన్‌ను ఫ్రాన్స్ ఆర్మీ కబ్జా చేసింది.
- చాలా దశాబ్దాల పాటు లెబనాన్‌ను ఫ్రాన్స్ పాలించింది. దీంతో అక్కడ ఆధునిక పోకడలు ఉండేవి.
- 1930వ దశకంలో లెబనాన్‌లో సెయింట్ జార్జ్ హోటల్ ప్రారంభించారు. బీచ్ క్లబ్ ఏర్పాటు చేశారు. భారీ స్టార్ హోటల్స్, నైట్‌క్లబ్‌లు కూడా లెబనాన్‌లో ఏర్పాటయ్యాయి.
- అరబ్ దేశాలకు చెందిన సంపన్న చమురు వ్యాపారులు అప్పట్లో లెబనాన్ టూర్‌కు నిత్యం వచ్చేవారు.
- లెబనాన్‌లో తయారయ్యే చౌటా ముసార వైన్ చాలా ఫేమస్.
- లెబనాన్‌లోని వాతావరణం ద్రాక్ష పంట సాగుకు అనుకూలం.
- లెబనాన్‌లోని బీరుట్ నగరంలో ఉన్న ‘హమరా స్ట్రీట్’ 1960వ దశకంలో షాపింగ్ కేంద్రంగా ఉండేది. అరబ్ సంపన్నులు ఈ ఏరియాలో లగ్జరీ షాపింగ్ చేసేందుకు వచ్చేవారు.
Also Read :Owners Names : యోగి బాటలోనే హిమాచల్ కాంగ్రెస్ సర్కారు.. హోటళ్ల ఎదుట ఓనర్ల నేమ్‌బోర్డ్స్ పెట్టాలని ఆర్డర్
- 1975 సంవత్సరం నుంచి లెబనాన్‌లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
- 1975లో క్రిస్టియన్ వర్గానికి చెందిన మిలిటెంట్లు పాలస్తీనీయులను తరలిస్తున్న బస్సుపై దాడి చేశారు. దీంతో హింసాకాండ మొదలైంది.
- 1975 నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు లెబనాన్‌లో జరిగిన హింసలో లక్షలాది మంది చనిపోయారు.
- ఈ హింసాకాండ నేపథ్యంలో ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లోని షియా వర్గం ఒక మిలిటెంట్ సంస్థను ఏర్పాటు చేసింది. దానిపేరే హిజ్బుల్లా.
- 1976 నుంచి 1988 వరకు లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. 1989లో యుద్ధం ఆగింది.
- ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లాకు లెబనాన్‌పై పట్టు పెరగడంతో సున్నీ అరబ్ దేశాలు దూరమయ్యాయి.
- పెట్టుబడులు రాకపోవడంతో లెబనాన్ పౌండ్ విలువ పడిపోయింది.