Jennifer Lope: ఐదో పెళ్ళికి సిద్దమైన జెన్నిఫర్ లోపెజ్
జెన్నిఫర్ లోపెజ్ తన జీవితంలో నాలుగు సార్లు వివాహం చేసుకుంది. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భర్తల నుంచి విడిపోయిన తర్వాత.. ఇప్పుడు జెన్నిఫర్ తన నాలుగో భర్త బెన్ అఫ్లెక్ నుంచి కూడా విడిపోయింది.
- By Praveen Aluthuru Published Date - 03:47 PM, Fri - 17 May 24

Jennifer Lope: జెన్నిఫర్ లోపెజ్.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. పుట్టిన ఊరు వదిలి న్యూయార్క్ వెళ్లి డ్యాన్సర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తన పాటలతో అమెరికన్లను ఉర్రుతలూగించింది. కుర్రకారుని టార్గెట్ చేస్తూ అనేక ఆల్బమ్స్ ద్వారా తన పాపులారిటీని పెంచుకుంది. అయితే ఆమె వ్యక్తిగతంగా అనేక వివాదాల్లో ఇరుక్కుంది. వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె త్వరలో ఐదో పెళ్ళికి సిద్దమవుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన ఈ అమెరికన్ పాప్ సింగర్ తన నాలుగో పెళ్లితో వార్తల్లోకి ఎక్కారు. 20ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత విడిపోయి మళ్ళీ తన ప్రియుడు బెన్ అఫ్లెక్ ని ఆమె పెళ్లాడారు. అయితే తాజాగా ఆమె బెన్ అఫ్లెక్ విడిపోయారని తెలుస్తుంది. ఇద్దరి సెపరేట్ గా ఉంటున్నారట. నిజానికి జెన్నిఫర్ లోపెజ్ భర్త బెన్ అఫ్లెక్ నుండి విడిపోతున్నారని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. బెన్ మరియు జెన్నిఫర్ 2022 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. హాలీవుడ్‌లో ఎక్కువగా మాట్లాడే జంటలలో ఇద్దరూ ఒకరు. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే వార్త జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
జెన్నిఫర్ లోపెజ్ తన జీవితంలో నాలుగు సార్లు వివాహం చేసుకుంది. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భర్తల నుంచి విడిపోయిన తర్వాత.. ఇప్పుడు జెన్నిఫర్ తన నాలుగో భర్త బెన్ అఫ్లెక్ నుంచి కూడా విడిపోయింది. బెన్ ఇప్పటికే జెన్నిఫర్ ఇంటిని విడిచిపెట్టాడట. త్వరలో తమ కలల ఇంటిని విక్రయించాలని ఇద్దరూ ప్లాన్ చేసుకుంటున్నారని నివేదికలు చెప్తున్నాయి. విడిపోయిన తర్వాత ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. జెన్నిఫర్ మరియు బెన్ 2022 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇంతకు ముందు వీరిద్దరూ 20 ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. జెన్నిఫర్‌కు బెన్ నుండి మాక్స్ మరియు ఎమ్మే (జెన్నిఫర్ లోపెజ్ కిడ్స్ మాక్స్ మరియు ఎమ్మే) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read: Pushpa 2 : పుష్ప 2 స్పెషల్ సాంగ్ అలా ప్లాన్ చేస్తున్నారా.. డబుల్ ధమాకా ఇచ్చేందుకు సిద్ధమా..?