HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Irans Missile Attacks On Oil Tankers In Hormuz

Strait of Hormuz: హార్మూజ్‎లో చమురు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

  • Author : Vamsi Chowdary Korata Date : 07-07-2026 - 2:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Iran's missile attacks on oil tankers in Hormuz
Iran's missile attacks on oil tankers in Hormuz

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాత, హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని రెండు క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో హార్ముజ్ జలసంధి నుంచి ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

హార్మూజ్ జలసంధిలోని ఒమాన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై గుర్తుతెలియని ప్రాజెక్టయిల్ పడటంతో మంటలు చెలరేగాయి. యునైటెడ్ కింగ్‌డమ్ మెరిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఒమాన్‌లోని లిమాహ్ సమీపంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తున్న ట్యాంకర్ ఎడమ వైపు ఈ ప్రాజెక్టయిల్ పడింది. ఈ ప్రమాదంతో ఎలాంటి నష్టం జరగలేదని బ్రిటిష్ సైన్యం వెల్లడించింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దాడికి ఇప్పటివరకు ఏ సంస్థా బాధ్యత స్వీకరించలేదు.

ఖమేనీ అంత్యక్రియల సమయంలో తాము తలుచుకుంటే ఇరాన్ అగ్ర నేతలు అందరినీ ఒకేసారి మట్టుపెట్టేస్తాం అంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. కానీ.. తాము అలాంటి పని చేయడం లేదని, ఎందుకంటే ప్రస్తుతం ఇరు దేశాలు శాంతి ఒప్పందంలో ఉన్నాయని చెప్పారు. దీనిపై ఇరాన్ కూడా ఘాటుగానే బదులిచ్చింది. ఈ వ్యాఖ్యల తర్వాతే హార్మూజ్‌లో మంటలు చెలరేగడం ఆసక్తికరంగా మారింది.

మూడు వారాల క్రితమే అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు నిలిపివేయాలని ఇరాన్ అంగీకరించింది. అంతేకాకుండా ఖతార్ మధ్యవర్తిత్వంలో అమెరికా-ఇరాన్ మధ్య వారం రోజుల పాటు దాడులు నిలిపివేయాలనే తాత్కాలిక ఒప్పందం కూడా ఇటీవల ముగిసింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన దాడులు మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

ఇటీవల రోజుల్లో ఒమాన్ సమీపంలో ప్రయాణిస్తున్న మరో రెండు నౌకలపై కూడా ఇరాన్ దాడి చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన సముద్ర మార్గం కావడంతో, ఈ వరుస ఘటనలు అంతర్జాతీయంగా ఆందోళనకు దారితీశాయి. ప్రస్తుతం సముద్ర భద్రతపై వివిధ దేశాలు నిఘా మరింత పెంచాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Iran Missile Attack
  • Merchant Ships
  • Qatar Cargo Ship
  • Strait of Hormuz

Related News

Central Government Lifts Em

Gas supply : గ్యాస్ సరఫరా పై అత్యవసర ఆంక్షలను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం

హర్మూజ్ జలసంధి మార్గంలో ద్రవీకృత సహజవాయువు (ఎల్‌ఎన్‌జీ) రవాణా మళ్లీ సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    Latest News

    • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

    • ‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది

    • Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

    • E25 పెట్రోల్ నివేదికను కేంద్రం తిరస్కరించింది.. పరీక్షలు పూర్తయ్యే వరకు ఎటువంటి నిర్ణయం లేదని పేర్కొంది.

    • Strait of Hormuz: హార్మూజ్‎లో చమురు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd