HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iran Retaliates After Us Strike Escalates Global Tensions

Iran-Israel : ఇజ్రాయెల్‌పై మరోసారి ఇరాన్ దాడులు

శనివారం రాత్రి అమెరికా చేపట్టిన దాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై విజయవంతమైన వైమానిక దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఇది అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

  • Author : Kavya Krishna Date : 22-06-2025 - 12:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
UAE-Qatar Oil Facility
UAE-Qatar Oil Facility

Iran-Israel : శనివారం రాత్రి అమెరికా చేపట్టిన దాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలపై విజయవంతమైన వైమానిక దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఇది అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. అగ్రరాజ్యం చేసిన ఈ సైనిక చర్యతో ఇరాన్ వెనక్కి తగ్గుతుందని అనుకున్నప్పటికీ, వాస్తవం భిన్నంగా ఉంది.

అందరి అంచనాలను తలకిందుల చేస్తూ, దాడి తర్వాత కొద్దిసేపటికే ఇరాన్ తిరిగి స్పందించింది. ఇజ్రాయెల్‌ రాజధాని టెల్ అవీవ్‌తో పాటు ఇతర ప్రాంతాలపై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, దాడులు కొనసాగించడం భవిష్యత్‌కు సంబంధించి ఎన్నో అనిశ్చితతలకు దారితీస్తుందని పలు దేశాలు భావిస్తున్నాయి.

ఇరాన్‌పై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఈ ఘర్షణకు మూడో ప్రపంచ యుద్ధం ముప్పుగా మారే అవకాశాన్ని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నిలవగా, ఇరాన్‌కు మద్దతుగా రష్యా, చైనా తదితర దేశాలు బరిలోకి దిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదే జరిగితే అంతర్జాతీయ శాంతికి పెద్ద ముప్పుగా మారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌ను శాంతి చర్చలకు రావాలని కోరుతూ, “ఇది శాంతికి తగిన సమయం” అంటూ పిలుపునిచ్చారు. కానీ ఆ హెచ్చరికలను లెక్కచేయకుండా ఇరాన్ మరోసారి దాడులకు తెగబడటంతో, దీనికి దారితీసే పరిణామాలపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Netanyahu : “మేము మొదలుపెట్టాం.. అమెరికా పూర్తి చేసింది”.. నెతన్యాహు వ్యాఖ్యలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • donald-trump-airstrike
  • global-security-crisis
  • Iran Missile Attack
  • iran-nuclear-centers
  • iran-retaliation
  • iran-us-conflict
  • Israel-Iran War
  • Middle East Tensions
  • Tel Aviv Attack
  • world-war-3-threat

Related News

Iran's missile attacks on oil tankers in Hormuz

Strait of Hormuz: హార్మూజ్‎లో చమురు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌పై చేసిన వ్యాఖ్యల తర్వాత, హార్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని రెండు క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో హార్ముజ్ జలసంధి నుంచి ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలు దెబ్బతిన్నాయి. అయితే, ఈ ఘటన

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd