India Shock to Trump : ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న భారత్
India Shock to Trump : "యూనిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్" కింద అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, వాణిజ్య మేళాలు, కొనుగోలుదారులు-అమ్మకందారుల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు
- By Sudheer Published Date - 07:31 PM, Thu - 28 August 25

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు అమలులోకి రావడంతో భారత వాణిజ్య రంగానికి పెద్ద సవాలు ఎదురైంది. అమెరికా టారిఫ్‌ల ప్రభావం వల్ల మన ఎగుమతి ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీ తట్టుకోవడంలో ఇబ్బంది పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించి, మన పరిశ్రమలు నష్టపోకుండా రక్షించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసింది.
Pocharam Barrage : రికార్డు వరదను తట్టుకున్న 100 ఏళ్ల పోచారం బ్యారేజ్ ..అసలు సీక్రెట్ ఇదే !!
ప్రధానంగా జౌళి వస్తువులు, జెమ్స్, ఆభరణాలు, దుస్తులు వంటి ఎగుమతులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్పత్తులను ఇతర దేశాలలో విస్తృతంగా ప్రమోట్ చేయడం ద్వారా అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించాలని చూస్తోంది. అందుకోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి 40 దేశాలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కేంద్ర వాణిజ్య శాఖ సిద్ధమైంది. ఈ దేశాలు ప్రతీ సంవత్సరం 590 బిలియన్ డాలర్ల విలువైన టెక్స్టైల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. వాటిలో భారత ఉత్పత్తులకు కొంత వాటా పెరిగితే పరిశ్రమలకు ఊతమివ్వగలదని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్యక్రమాల ద్వారా సూరత్, తిరుపూర్, పానిపట్, బదోహి వంటి ప్రాంతాల్లో తయారయ్యే భారత స్వదేశీ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేయనుంది. “యూనిఫైడ్ బ్రాండ్ ఇండియా విజన్” కింద అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, వాణిజ్య మేళాలు, కొనుగోలుదారులు-అమ్మకందారుల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. వస్తువుల నాణ్యత, సుస్థిరతను ప్రదర్శించడం ద్వారా భారత్ తన మార్కెట్‌ను మరింత బలపరచాలని చూస్తోంది. ఈ చర్యలు వాణిజ్య రంగాన్ని రక్షించడమే కాకుండా, కొత్త అవకాశాలను సృష్టించి పరిశ్రమలకు విస్తృత ప్రయోజనం కలిగిస్తాయని కేంద్రం విశ్వసిస్తోంది.