Ballistic Missile Test: అమెరికా హెచ్చరిక బేఖాతర్..బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన కొరియా..!!
ఉత్తరకొరియా తన పిచ్చి చేష్టలను వదులుకోవడం లేదు. ప్రపంచానికి వ్యతిరేకంగా పనుల చేస్తూనే ఉంది. అమెరికా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
- By hashtagu Published Date - 09:24 AM, Sat - 1 October 22

ఉత్తరకొరియా తన పిచ్చి చేష్టలను వదులుకోవడం లేదు. ప్రపంచానికి వ్యతిరేకంగా పనుల చేస్తూనే ఉంది. అమెరికా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాను అనుకున్నట్లుగా మరోసారి బాలిస్టిక్ క్షిపణీని ప్రయోగించింది ఉత్తర కొరియా. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దక్షిణ కొరియా పర్యటన నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ పరీక్ష నిర్వహించింది. జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఈ వార్తను ధృవీకరించింది. ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం వరుసగా ఇది నాలుగోసారి. ఇంతకుముందుకూడా కొరియా తన తూర్పు జలాల వైపు మూడుసార్లు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త క్షిపణి పరీక్షలు DMZ నుండి నిష్క్రమించకుండా హారిస్‌ను నిరోధించలేవని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారీన్ జీన్-పియర్ చెప్పారు. ప్రాంతీయ భద్రత పట్ల అమెరికా బలమైన నిబద్ధతను చూపించడానికి కమలా హారిస్ అక్కడికి వెళ్లాలనుకుంటున్నారని తెలిపారు. అంతకుముందు కొరియా చేపట్టిన బాలిస్టిక్ క్షిపణుల పరీక్షను కమలా హారిస్ తోపాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఖండించారు.