Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ ద్వీపంలో సోమవారం ఉదయం 6.11 గంటలకు భూకంపం సంభవించినట్లు
- By Praveen Aluthuru Published Date - 09:07 AM, Mon - 24 April 23

Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ ద్వీపంలో సోమవారం ఉదయం 6.11 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌ఎస్‌సి) నివేదించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా.. అక్కడి అధికారులు సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేయగా.. అమెరికా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
న్యూజిలాండ్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గత నెల మర్చిలో న్యూజిలాండ్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో కెర్మాడెక్ దీవులను తాకింది. భూమికి 152 కిలోమీటర్ల లోతులో భూమి పొరలు కంపించాయి.న్యుజిలాండ్ లో వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆ మధ్య వచ్చిన గాబ్రిల్లా తుఫాన్ దేశంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన భూకంపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి.
Read More: KTR Counter: అమిత్‌షాకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్