SpaceX Crew 8 : 233 రోజుల తర్వాత భూమికి చేరిన వ్యోమగాములు.. ఎలా అంటే ?
వాస్తవానికి ఈ ఆస్ట్రోనాట్లు(SpaceX Crew 8) ఈ ఏడాది ఆగస్టులోనే భూమికి తిరిగి రావాల్సి ఉంది.
- By Pasha Published Date - 05:00 PM, Sun - 27 October 24

SpaceX Crew 8 : ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఏడు నెలలు(233 రోజులు) గడిపిన నాసా ‘స్పేస్ ఎక్స్’ డ్రాగన్ వ్యోమనౌక క్రూ-8 విజయవంతంగా భూమికి తిరిగొచ్చారు. ఫ్లోరిడాలోని పెన్సకోలా సముద్ర తీరంలో వారు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఈ క్రూలో అమెరికా, రష్యాలకు చెందిన వ్యోమగాములు ఉన్నారు. భూమిపైకి చేరుకున్న వెంటనే ఆస్ట్రోనాట్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. స్పేస్ ఎక్స్ రికవరీ టీమ్స్ పెన్సకోలా సముద్ర తీరంలో డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను రికవరీ చేసి భద్రపరిచారు. ఈ మిషన్‌లో భాగంగా వ్యోమగాములు 200కుపైగా శాస్త్రీయ పరిశోధనలు చేశారు.
LIVE: #Crew8 returns home from their mission on the @Space_Station. Splashdown of the @SpaceX Dragon capsule is expected at 3:29am ET (0729 UTC). https://t.co/PdNQljsPoG
— NASA (@NASA) October 25, 2024
Also Read :Black Bommidai Fish : 8 అడుగుల పొడవు నల్ల బొమ్మిడాయి చేప.. రేటు, టేస్టు వివరాలివీ
- అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’కు చెందిన వ్యోమగాములు మాథ్యూ డొమినిక్, మైఖేల్ బారెట్, జీనెట్ ఎప్స్.. రష్యాకు చెందిన రోస్కోస్మోస్ సంస్థ వ్యోమగామి అలెగ్జాండర్ గ్రెబెంకిన్ ఈ ఏడాది మార్చిలో డ్రాగన్ ఎండీవర్ రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు.
- వాస్తవానికి ఈ ఆస్ట్రోనాట్లు(SpaceX Crew 8) ఈ ఏడాది ఆగస్టులోనే భూమికి తిరిగి రావాల్సి ఉంది.
- సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు రావడంతో ..వీరిని భూమికి తిరిగి తీసుకొచ్చే మిషన్‌లో జాప్యం జరిగింది.
- తదుపరిగా అక్టోబర్ 7న ఈ నలుగురు వ్యోమగాములను భూమికి తీసుకురావాలని భావించారు. అయితే అమెరికాలో సంభవించిన మిల్టన్ తుఫాను కారణంగా ఆ ప్లాన్ కూడా వాయిదా పడింది. ఎట్టకేలకు ఇప్పుడు 233 రోజుల తర్వాత వారు భూమికి సేఫ్‌గా చేరుకున్నారు.
- ఇక ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమికి తీసుకురావటానికి స్పేస్‌ఎక్స్ క్రూ-9 డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వెళ్లింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2025 ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వస్తారు.