Netanyahus Residence : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై ఫ్లాష్ బాంబులు
ఈ దాడి జరిగినప్పుడు నివాసంలో నెతన్యాహూ(Netanyahus Residence) కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
- By Pasha Published Date - 08:57 AM, Sun - 17 November 24

Netanyahus Residence : లెబనాన్‌లోని మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా మరోసారి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై దాడికి పాల్పడింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా ప్రాంతంలో ఉన్న నెతన్యాహు నివాసంపై రెండు ఫ్లాష్ బాంబులు పడ్డాయి. ఆ బాంబులు ఫ్లాష్‌ను వెదజల్లుతూ పేలడం అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. నివాసంలోని తోటలో ఆ బాంబులు పడినట్లు గుర్తించారు. ఈ దాడి జరిగినప్పుడు నివాసంలో నెతన్యాహు(Netanyahus Residence) కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
🛑| BREAKING: A couple of hours ago, grenades/bombs were dropped at Netanyahu’s house, causing for a fire to break out.
The bomb exploded near one of the security guards. pic.twitter.com/rdZ2SjtL8M
— Arya – آریا (@AryJeay) November 17, 2024
Also Read :Nara Rohith : నాన్న మరణంతో నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..
ఈ దాడిని ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హిజ్బుల్లా రెడ్ లైన్‌ను దాటి దాడులు చేస్తోందని మండిపడింది. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హిజ్బుల్లాను ఇజ్రాయెల్ సర్కారు హెచ్చరించింది. ఈమేరకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ న్యాయశాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బాంబు దాడులు తమను ఎంతో కలవరానికి గురిచేశాయని ఆయన పేర్కొన్నారు. మిలిటెంట్ సంస్థలు హద్దులు మీరి దాడులు చేస్తున్నాయని ఇసాక్ హెర్జోగ్ మండిపడ్డారు. దీనిపై తాను ఇజ్రాయెల్ నిఘా సంస్థ షిన్ బెట్ అధిపతితోనూ చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడికి కారకులైన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గత నెలలోనూ నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి. అయితే ఆ టైంలో కూడా ఇంట్లో నెతన్యాహు కుటుంబం లేదు. ఇలాంటి దాడులు జరుగుతుండటంతో నెతన్యాహు తన స్నేహితులు, సన్నిహితుల ఇళ్లలో ఉంటున్నారని తెలుస్తోంది.