Thomas Matthew Crooks : ట్రంప్‌పై కాల్పులు జరిపిన క్రూక్స్.. ఫొటో, బయోడేటా ఇదీ
థామస్ మాథ్యూ క్రూక్స్.. 20 ఏళ్ల ఈ కుర్రాడే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)పై ఈనెల 13న పెన్సిల్వేనియాలో కాల్పులు జరిపాడు.
- By Pasha Published Date - 11:02 AM, Mon - 15 July 24

Thomas Matthew Crooks : థామస్ మాథ్యూ క్రూక్స్.. 20 ఏళ్ల ఈ కుర్రాడే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)పై ఈనెల 13న పెన్సిల్వేనియాలో కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వెంటనే క్రూక్స్‌ను(Thomas Matthew Crooks) అమెరికా సీక్రెట్ సర్వీస్ స్నైపర్లు కాల్చి చంపారు. తాజాగా ఈ హంతకుడి ఫొటో, వివరాలను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారికంగా విడుదల చేసింది.
We’re now on WhatsApp. Click to Join
- థామస్ మాథ్యూ క్రూక్స్ బెతెల్ పార్క్ ఏరియా హైస్కూల్‌లో 2022 వరకు చదువుకున్నాడు. అక్కడే డిగ్రీ పూర్తి చేశాడు.
- నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనీషియేటివ్ నుంచి 500 డాలర్ల స్టార్ అవార్డును అందుకున్నాడు.
- క్రూక్స్ ఒంటరిగా, సైలంట్ గా ఉండేవాడని అతడి క్లాస్ మేట్స్ చెబుతున్నారు.
- క్రూక్స్ ఎప్పుడూ రాజకీయాలు లేదా ట్రంప్ గురించి చర్చించలేదని అంటున్నారు.
- అతడు స్కూల్‌లో తరచుగా ఇతరుల వల్ల తీవ్రమైన బెదిరింపులకు గురయ్యాడని అతడి క్లాస్ మేట్స్ చెప్పారు.
Also Read :Buying A Flat : ఫ్లాట్ కొంటున్నారా ? ఈ వాస్తు టిప్స్ గుర్తుంచుకోండి
- గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటి నుంచి క్రూక్స్.. ఒక నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్నాడు.
- ఎఫ్‌బీఐ అధికారులు క్రూక్స్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
- క్రూక్స్ కారు నుంచి అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించారు.
- నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేసేందుకు క్రూక్స్ అర్హతను పొందాడు.
- ట్రంప్‌పై కాల్పులు జరిపేందుకు క్రూక్స్ ఏఆర్-15 రైఫిల్‌ను వాడాడు.
Also Read :NCC Special Entry : ఎన్‌సీసీ చేసిన వారికి జాబ్స్.. ట్రైనింగ్‌లో ప్రతినెలా రూ.56వేలు
జగన్నాథుని రథయాత్రకు ట్రంప్ సహకారం
డొనాల్డ్ ట్రంప్ సహకారంతో 1976లో యునైటెడ్ స్టేట్స్‌లోని ఎన్‌వైసీ వీధుల్లో జగన్నాథుని మొదటి రథయాత్ర జరిగింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) న్యూయార్క్ నగరంలో రథయాత్రను నిర్వహించాలనుకున్నప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. అప్పట్లో రథాలను తయారు చేసేందుకు పెద్ద ఖాళీ స్థలం అవసరమైంది. ఈ నేపధ్యంలో నాడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇస్కాన్ సంస్థ సంప్రదించగా, ఆయన తన ఫిష్డ్ అవెన్యూను రథాల తయారీ కోసం ఉపయోగించుకునేందుకు అనుమతించారు. ఈ విధంగా ట్రంప్ అమెరికాలో జగన్నాథ రథయాత్ర సాగేందుకు సహకారం అందించారు.