Buying A Flat : ఫ్లాట్ కొంటున్నారా ? ఈ వాస్తు టిప్స్ గుర్తుంచుకోండి
వాస్తు రూల్స్ ప్రకారం ఉన్న ఫ్లాట్‌ను కొంటే మన కుటుంబ జీవితాలను సంతోషమయం చేస్తుంది. శాంతిని అందిస్తుంది.
- By Pasha Published Date - 09:02 AM, Mon - 15 July 24

Buying A Flat : నిత్యం ఎంతోమంది అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈక్రమంలో కొన్ని విషయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రత్యేకించి కొన్ని వాస్తు నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. వాస్తు రూల్స్ ప్రకారం ఉన్న ఫ్లాట్‌ను కొంటే మన కుటుంబ జీవితాలను సంతోషమయం చేస్తుంది. శాంతిని అందిస్తుంది. ఒకవేళ వాస్తు నియమాలకు విరుద్ధంగా ఉండే ఫ్లాట్‌ను కొంటే ఇందుకు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్లాట్స్‌ను కొనేటప్పుడు(Buying A Flat) గుర్తుంచుకోవాల్సిన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- మనం కొనబోయే ఫ్లాట్‌లో ప్రధానమైన పడక గది నైరుతి దిక్కున ఉండాలి. ఈ గదిలో కుటుంబ పెద్ద మాత్రమే నిద్రించాలి. ఒకవేళ బెడ్ రూం ఈశాన్యం దిక్కులో ఉంటే ప్రశాంతతకు భంగం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి.
- మీరు ఫ్లాట్‌ను కొంటున్న అపార్ట్‌మెంట్‌లో మెట్లు పశ్చిమం లేదా నైరుతి దిక్కులో ఉండాలి. ఒకవేళ వేరే దిక్కుల్లో ఉంటే అంత మంచిది కాదు. మెట్లు పశ్చిమం లేదా నైరుతి దిక్కులో ఉంటే.. ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించేవారికి ఆర్థిక శక్తి లభిస్తుంది.
Also Read :Matsya 6000 : ‘మత్స్య 6000’ మరో రికార్డు.. ప్రతి విడిభాగానికి ధ్రువీకరణ
- ఫ్లాట్‌లోని లివింగ్ రూమ్ అనేది ఉత్తరం లేదా ఈశాన్యం దిక్కులో ఉండాలి. లివింగ్ రూమ్‌లో పదునైన వస్తువులను ఉంచకూడదు. ఒకవేళ పదునైన వస్తువులను ఈ గదిలో ఉంచితే అశాంతి చెలరేగే ముప్పు ఉంటుంది.
- ఆగ్నేయం అనేది అగ్నిదేవుడి దిక్కు. అందుకే మనం కొనబోయే ఫ్లాట్‌లో వంటగది ఆగ్నేయం దిక్కులో ఉంటే బెటర్. ఈ దిశలో వంటగది ఉంటే శక్తి ప్రవాహం చాలా బెటర్‌గా, సేఫ్‌గా జరుగుతుంది.
- మనం కొనే ఫ్లాట్‌లో(Vastu Rules) ప్రధాన ద్వారం అనేది ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్యం దిక్కులో ఉండాలి. ఈ దిక్కుల నుంచి ఉదయపు కాంతి కిరణాలు ఇంట్లోకి పడటం చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల వెంటిలేషన్ ప్రాబ్లమ్ ఉండదు. దీనివల్ల అదృష్టం, ఆశావాదం, సానుకూల ఆలోచనలు అనేవి ఇంట్లో ఉండేవారికి దక్కుతాయి.
- ఫ్లాట్‌లోని టాయిలెట్లు వాయవ్య లేదా పడమర దిక్కుల్లో ఉంటే బెటర్. దీనివల్ల ఇంట్లో ఎంతో సౌకర్యం, శుభ్రతను మెయింటైన్ చేయొచ్చు.
- ఫ్లాట్‌లోని గోడల కోసం పాస్టెల్, లేత నీలం, ఆకుపచ్చ రంగులను వేయొచ్చు. ఈ కలర్స్ సానుకూల శక్తిని ఇంట్లో ప్రసరింపజేస్తాయి.
Also Read :Trump : ట్రంప్ మళ్లీ యాక్టివ్.. ప్రత్యేక విమానంలో మిల్వాకీకి
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.