Panic on Denver Airport Runway : విమానంలో పొగలు.. తృటిలో తప్పిన ప్రమాదం
Panic on Denver Airport Runway : ఈ ఘటనతో డెన్వర్ విమానాశ్రయంలో కొన్ని గంటలపాటు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సిబ్బంది స్పందనతో పెద్ద ప్రమాదం తప్పింది
- Author : Sudheer
Date : 27-07-2025 - 12:49 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(Panic on Denver Airport Runway)లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మియామీ వెళ్లేందుకు సిద్ధమైన US ఎయిర్లైన్స్‌కి చెందిన ఫ్లైట్-3023 విమానం (US Airlines Flight 3023) టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా రన్‌వేపైనే అత్యవసరంగా నిలిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానం టేకాఫ్‌కు సిద్ధమైన సమయంలో ల్యాండింగ్ గేర్ లో సమస్య తలెత్తడంతో విమానంలో పొగలు అలుముకున్నాయి.
Telangana : రాష్ట్రవ్యాప్తంగా 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలు.. మార్గదర్శకాలు విడుదల
విమానంలోని వెనుక భాగం నుండి దట్టమైన పొగలు రావడం మొదలవటంతో ప్రయాణికులందరూ ఆందోళనకు గురయ్యారు. మంటలు వ్యాపించడంతో పైలట్ అప్రమత్తతతో రన్‌వేపైనే విమానాన్ని నిలిపివేశాడు. వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది రంగంలోకి దిగారు. విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 173 మంది ప్రయాణికులు, సిబ్బందిని అప్రమత్తంగా విమానం నుంచి దింపి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి కొద్దిగా విషమంగా ఉండటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. మిగిలినవారికి ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం. ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ (FAA) మరియు ఎయిర్లైన్స్ అధికారులు కలిసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో డెన్వర్ విమానాశ్రయంలో కొన్ని గంటలపాటు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సిబ్బంది స్పందనతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికుల ప్రాణాలు కాపాడగలగడం పట్ల విమానాశ్రయ సిబ్బందిని పలువురు అభినందించారు. ల్యాండింగ్ గేర్ సమస్యపై పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.