Agent Trump : ట్రంప్ రష్యా గూఢచారా ? ఆయన కోడ్ నేమ్ ‘క్రస్నోవ్’ ?
కేజీబీలో డొనాల్డ్ ట్రంప్(Agent Trump) కోడ్‌నేమ్ ‘క్రస్నోవ్’ అని అల్నూర్ ముస్సాయేవ్ తెలిపారు.
- By Pasha Published Date - 05:00 PM, Tue - 4 March 25

Agent Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. రష్యాతో యుద్ధం కోసం ఉక్రెయిన్ సిద్ధపడటాన్ని ట్రంప్ తప్పుపడుతున్నారు. రష్యాతో అమెరికాకు పెద్దగా ముప్పేం లేదని ఆయన వాదిస్తున్నారు. తద్వారా అమెరికా, రష్యా మధ్యనున్న గ్యాప్‌ను తగ్గించేందుకు ట్రంప్ యత్నిస్తున్నారు. ప్రపంచానికి మూడో ప్రపంచ యుద్ధం అక్కర్లేదని ఆయన పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ గురించి ఓ కుట్ర కోణం ప్రచారంలోకి వచ్చింది. అమెరికాలో రష్యా నియమించుకున్న కేజీబీ ఏజెంట్లలో ట్రంప్ ఒకరై ఉండొచ్చని పలువురు అంటున్నారు. ఈమేరకు పలు అంతర్జాతీయ పత్రికల్లో సంచలన కథనాలు ప్రచురితం అవుతున్నాయి.
Also Read :Copy Paste Blunder: కాపీ పేస్ట్ తప్పిదం.. రూ.52వేల కోట్లు తప్పుడు బ్యాంకు ఖాతాకు !
ట్రంప్ రష్యా ఏజెంటా ?
- 1980వ దశకంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికన్లకు వ్యాపారవేత్తగా మాత్రమే తెలుసు. ‘‘1987లో ట్రంప్‌ను రష్యా గూఢఛార సంస్థ కేజీబీ ఏజెంటుగా నియమించుకుంది’’ అంటూ సోవియట్ యూనియన్ మాజీ ఇంటెలీజెన్స్ చీఫ్ అల్నూర్ ముస్సాయేవ్ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత అల్నూర్ కజకిస్థాన్ ఆర్మీలో పనిచేశారు.
- కేజీబీలో డొనాల్డ్ ట్రంప్(Agent Trump) కోడ్‌నేమ్ ‘క్రస్నోవ్’ అని అల్నూర్ ముస్సాయేవ్ తెలిపారు.
- ట్రంప్‌నకు సంబంధించిన కీలక సమాచారాన్ని గుప్పిట్లో పెట్టుకొని, అమెరికాలో రష్యా పావులు కదుపుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది.
- అందమైన మగువల సప్లై, ఆర్థిక సహకారం వంటి వాటి ద్వారా ట్రంప్‌ను పుతిన్ గుప్పిట్లో పెట్టుకొని ఉండొచ్చనే టాక్ కూడా వ్యాపిస్తోంది.
- 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ నుంచి ట్రంప్‌కు ఎలాంటి సాయమూ అందలేదట. దాన్ని మనసులో పెట్టుకొని, ఆయన ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారనే కోణంలోనూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.
- ఉక్రెయిన్‌లో జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు వ్యాపారాలు ఉన్నాయి. వాటిపై దర్యాప్తు చేయించాలని ట్రంప్ గతంలో డిమాండ్ చేసినా ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ పట్టించుకోలేదు. దాన్ని కూడా ట్రంప్ మనసులో పెట్టుకున్నారట.
- డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. ఇందుకోసం రష్యాకు చెందిన ఎంతోమంది ఆయనకు పెట్టుబడులను సమకూరుస్తున్నారు. ఈ జాబితాలో పుతిన్ సన్నిహితులు, బినామీలు కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వారందరి వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకే రష్యాతో అమెరికాకు గ్యాప్‌ను ట్రంప్ తగ్గిస్తున్నారట.
- ఈ ఆరోపణలను బలపరిచేలా డెమొక్రటిక్ పార్టీకి చెందిన బర్నీ శాండర్స్ వంటి నేతలు ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తున్నారు.