Chicken: చికెన్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా.. కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు
ఓవరాల్ గా పరిశోధకులు చెప్పింది ఏంటంటే.. చికెన్ మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ..
- By News Desk Published Date - 10:15 PM, Sun - 27 April 25

Chicken: ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే వెజ్ తింటే మంచిదా..? నాన్ వెజ్ తింటే మంచిదా..? ఇలాంటి ప్రశ్నలు వైద్యులకు తరచూ ఎదురవుతూ ఉంటాయి. దీనిపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. కొందరు మొక్కల ఆధారిత ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెబితే.. మరికొందరు నాన్-వెజ్ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంతోపాటు బలంగా ఉంటారని సూచిస్తుంటారు. అయితే, కొందరికి నాన్ వెజ్ అందులోనూ చికెన్ లేనిదే గొంతులోకి ముద్దదిగదు. సండే వచ్చిందంటే కచ్చితంగా ఇంట్లో కోడి కూర వండాల్సిందే. ఇక పార్టీలు, ఫంక్షన్లలోనూ చికెన్ ఐటెమ్స్ కామన్. తాజాగా వెల్లడైన అధ్యయనాల్లో చికెన్ అతిగా తినేవారికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని తేలిందట.
Also Read: Pakistani nationals: కేంద్రం ఫుల్ సీరియస్.. వాళ్లకు మూడేళ్లు జైలు శిక్ష, రూ.3లక్షల జరిమానా..
ఇటలీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పరిశోధకుల నివేదికల ప్రకారం.. ఎక్కువగా చికెన్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం. వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తినేవారికి కడుపు, పేగు సంబంధిత వ్యాధులతోపాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలిందట. ఈ ముప్పు మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉండే అవకాశముందట.
Also Read: Mangoes With Chemicals: కెమికల్స్ కలిపిన మామిడికాయలు తింటే వచ్చే సమ్యలివే!
చికెన్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. వారు 20 సంవత్సరాల కాలంలో 4,869 మందిని అధ్యయనం చేశారు. ఎక్కువ చికెన్ తిన్న వారికి అకాల మరణ ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అయితే, ప్రమాదం చికెన్ నాణ్యతలో ఉందా..? దానిని డీప్ ఫ్రై చేయడం, గ్రిల్ చేయడం వంటి వండే విధానంలో ఉందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. దీనిని మరింత లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. వైట్ మీట్ ఎక్కువగా తీసుకుంటున్న వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వాళ్లున్నారు. పాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి, రెక్టల్ క్యాన్సర్ లాంటి వాటినీ గుర్తించారు. ఇలా పరిమితికి మించి మాంసం తింటున్న వాళ్లలో సుమారు 27 శాతం మంది ఏదో ఓ జబ్బుతో బాధపడుతున్నారని పరిశోధనల్లో తేలింది.
ఓవరాల్ గా పరిశోధకులు చెప్పింది ఏంటంటే.. చికెన్ మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే తీసుకోవాలట. వారానికి 100 గ్రాముల వరకు తింటే ఎలాంటి ముప్పు ఉండదట. రోజూ కాకుండా గ్యాప్ ఇస్తూ వారానికి రెండు లేదా మూడు సార్లు తినడం వల్ల ఇబ్బంది ఉండదట. క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుందట.