Earthquake : దక్షిణ అమెరికాలో భారీ భూకంపం… రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రత.. సునామీ హెచ్చరిక!
Earthquake: దక్షిణ అమెరికా ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) శక్తివంతమైన భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన ప్రకారం, డ్రేక్ పాశేజ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై తొలుత 8 తీవ్రతగా నమోదైంది.
- By Kavya Krishna Published Date - 10:08 AM, Fri - 22 August 25

Earthquake: దక్షిణ అమెరికా ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) శక్తివంతమైన భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించిన ప్రకారం, డ్రేక్ పాశేజ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై తొలుత 8 తీవ్రతగా నమోదైంది. అయితే తరువాత అంచనాలను సవరించి 7.5 తీవ్రతగా తేల్చారు. ఇంతటి శక్తివంతమైన భూకంపం సంభవించినప్పటికీ అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ నుంచి ఎలాంటి హెచ్చరిక వెలువడలేదు. కేవలం చిలీ ప్రభుత్వం మాత్రమే జాగ్రత్త చర్యగా సునామీ అలర్ట్‌ను ప్రకటించింది.
EPFO : డెత్ రిలీఫ్ ఫండ్ ను రూ. 15 లక్షలకు పెంచిన EPFO
భూకంప ఉత్పత్తి స్థలంపై వివరాలు కూడా వెల్లడయ్యాయి. USGS ప్రకారం, భూకంపం భూమి ఉపరితలం నుంచి 10.8 కిలోమీటర్ల లోతులో సంభవించింది. మరోవైపు జర్మనీకి చెందిన జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ ఈ ప్రకంపనల తీవ్రతను 7.1గా నమోదు చేసింది. అదే సమయంలో భారత నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపిన ప్రకారం, భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 07:46:22 గంటలకు ఈ ప్రకంపనలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
డ్రేక్ పాశేజ్ ప్రాంతం దక్షిణ అమెరికా టెక్టానిక్ ప్లేట్, అంటార్కిటిక్ టెక్టానిక్ ప్లేట్‌ల జంక్షన్ వద్ద ఉండటంతో భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది. అందువల్ల అక్కడ తరచుగా ప్రకంపనలు నమోదవుతుంటాయి. అయితే ఈసారి సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇప్పటివరకు పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయినప్పటికీ స్థానిక ప్రజల్లో ఆందోళన, భయభ్రాంతులు నెలకొన్నాయి.
India Batting Line-Up: ఆసియా కప్ 2025లో బలమైన బ్యాటింగ్ లైనప్‌తో టీమిండియా!