HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Dozens Of Prisoners Escape From Malir Jail In Karachi

Karachi Jail : కరాచీ జైలు నుంచి ఖైదీలు పరారీ!

Karachi Jail : జైలు భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంత భారీ సంఖ్యలో ఖైదీలు ఒకేసారి పరారయ్యే స్థాయికి భద్రత లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

  • Author : Sudheer Date : 03-06-2025 - 7:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karachi Jail
Karachi Jail

పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్ర కారాగారం(Malir Jail in Karachi)లో సంచలనం రేపే ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఖైదీలు (Dozens of prisoners) పోలీసులు పై దాడి చేసి జైలు గోడను ధ్వంసం చేసి పారిపోయారు (Escaped ). ఈ ఘటనలో సుమారు 50 నుండి 200 మంది ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నట్లు వార్తలు వెల్లడిస్తున్నాయి. అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో పోలీసులు అప్రమత్తమై కాల్పులు జరిపినప్పటికీ, అనేక మంది ఖైదీలు పరారయ్యారని తెలుస్తోంది.

Drones Hidden In Trucks: ర‌ష్యాపై మ‌రోసారి విరుచుప‌డిన ఉక్రెయిన్‌.. 41 ర‌ష్య‌న్ బాంబ‌ర్ విమానాలు ధ్వంసం!

పరారైన ఖైదీలలో 20 మందిని అధికారులు తిరిగి అరెస్టు చేసినట్లు సమాచారం. మిగిలిన ఖైదీల కోసం పోలీసులు, రేంజర్లు, ఇతర భద్రతా బలగాలు కరాచీ పరిసర ప్రాంతాల్లో వేట ప్రారంభించాయి. హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జైలు బయట ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖైదీలు ఎలా ఈ స్థాయిలో వ్యూహాత్మకంగా దాడి చేసి పారిపోయారన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

IPL 2025 Final: పంజాబ్‌- బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య పైచేయి ఎవ‌రిది? గ‌త మూడు మ్యాచ్‌ల్లో ఇరు జ‌ట్ల ఆట‌తీరు ఎలా ఉంది?

ఈ ఘటనపై అధికారికంగా పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడలేదు. జైలు భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంత భారీ సంఖ్యలో ఖైదీలు ఒకేసారి పరారయ్యే స్థాయికి భద్రత లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం అనుకోకుండా జరిగింది కాదని , ముందస్తు పన్నాగం కావచ్చన్న అనుమానాలు కూడా ఉన్నా, స్పష్టతకు అధికారిక ప్రకటన అవసరంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 45 to 50 inmates have escaped
  • jail's walls
  • Karachi Jail

Related News

    Latest News

    • LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తుందో తెలుసా?!

    • Newborn Baby: నవజాత శిశువును ఎలా నిద్ర పుచ్చాలి?

    • Sachin Meets Messi: మెస్సీని కలిసిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైర‌ల్‌!

    • IND U19 vs PAK U19: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం!

    • BRS : బిఆర్ఎస్ ను నడిపించే చరిష్మా కేసీఆర్ కు మాత్రమే ఉంది – TPCC చీఫ్ మహేష్

    Trending News

      • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

      • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

      • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

      • ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!

      • Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd