Gods Hand : దర్శనమిచ్చిన ‘గాడ్స్ హ్యాండ్’.. ఏమిటిది ?
Gods Hand : డార్క్ ఎనర్జీ కెమెరాకు ‘గాడ్స్ హ్యాండ్’ ఫొటో చిక్కింది. ఇంతకీ ఏమిటిది ?
- By Pasha Published Date - 02:19 PM, Tue - 14 May 24
Gods Hand : డార్క్ ఎనర్జీ కెమెరాకు ‘గాడ్స్ హ్యాండ్’ ఫొటో చిక్కింది. ఇంతకీ ఏమిటిది ? నిజంగా గాడ్స్ హ్యాండేనా ? అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరేం లేదు.. చిలీ దేశంలోని విక్టర్ ఎం బ్లాంకో 4-మీటర్ అనే భారీ టెలిస్కోప్ ఉంది. దానిపై అతిపెద్ద డార్క్ ఎనర్జీ కెమెరాను అమర్చారు. అది తాజాగా పాలపుంతకు సంబంధించిన ఒక ఫొటోను తీసింది. అందులోనే ‘గాడ్స్ హ్యాండ్’ (Gods Hand) దర్శనమిచ్చింది. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join
భూమికి 1300 కాంతి సంవత్సరాల దూరంలో CG 4 అనే కామెట్రీ గ్లోబుల్ ఉంది. కామెట్రీ గ్లోబుల్ అంటే తోకచుక్కల సమూహం కాదు. ఇది ఎరుపు కాంతితో కూడిన పొగలు, ధూళితో కూడిన సమూహం. చుట్టుపక్కల ఉండే నక్షత్రాల రేడియేషన్ ప్రభావం వల్ల CG 4 అనే కామెట్రీ గ్లోబుల్ నిత్యం వేడిగానే ఉంటుంది. ఇందులో అయోనైజ్డ్ హైడ్రోజన్ ఉంటుందని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. పొగలు, ధూళితో ఉండటం వల్ల దీని ఆకారం మారుతుంటుంది. దీని సైజు అతిభారీగా ఉంటుందని అంటున్నారు.
Also Read : Telangana Politics : తెలంగాణలో ప్రాంతీయ పార్టీల శకం ముగిసిపోతుందా?
తాజాగా చిలీ దేశంలోని డార్క్ ఎనర్జీ కెమెరాకు చిక్కిన CG 4 కామెట్రీ గ్లోబుల్ తోక భాగంలో అయోనైజ్డ్ హైడ్రోజన్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఎరుపు రంగు కాంతి గాఢత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అలా ఎరుపు రంగులో ఉన్న CG 4 కామెట్రీ గ్లోబుల్ తోక భాగం అనేది.. దానికి 100 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలోని ESO 257-19 అనే స్పైరల్ గెలాక్సీ వైపుగా ఉండటం డార్క్ ఎనర్జీ కెమెరాకు చిక్కింది. అది చేయి ఆకారంలో కనిపించడంతో సైంటిస్టులు గాడ్స్ హ్యాండ్ అని పేరు పెట్టారు. వాస్తవానికి అదొక కామెట్రీ గ్లోబుల్.