HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄World
  • ⁄Cuba Socialism On The World Map

Cuba Revolution: ప్రపంచ పటంలో క్యూబా సోషలిజం భేష్

ఎందుకో గాని క్యూబా అనగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది . యువ దశ నుండే చాలా మందికి క్యూబా మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది. డెబ్బై దశకంలోని యువకులకైతే మరీ...

  • By CS Rao Published Date - 11:58 AM, Sun - 12 March 23
Cuba Revolution: ప్రపంచ పటంలో క్యూబా సోషలిజం భేష్

ఎందుకో గాని క్యూబా (Cuba) అనగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది . యువ దశ నుండే చాలా మందికి క్యూబా మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది. డెబ్బై దశకంలోని యువకులకైతే మరీ ఎక్కువ అభిమానం ఉండేది. అది చేగువెరా వల్లా కాస్ట్రో వల్లా , లేక అతి చిన్న దేశం అతి పెద్ద అమెరికాను తట్టుకుని , ఎదిరించి నిలబడి నందు వల్లా అనేది ఇతిమిద్దంగా తెలియదు గాని క్యూబా (Cuba) అంటే సొంత దేశంగా భావించే వారు అనేకులు. యుద్ధాన్ని, యుద్ధ భయాన్ని చూపి ప్రపంచాన్ని భయపెట్టి తమ గుప్పెట పెట్టు కోవాలని చూసేవి సామ్రాజ్య వాద దేశాలయితే , అందులో పెద్దన్న పాత్ర పోషించేది అమె రికా . ఈ భూప్రపంచంలో ఎక్కు వుగా దోపిడీకి గురైన మూడు ఖండాలు లాటిన్ అమెరికా , ఆసియా , ఆఫ్రికాలు. ఈ మూడు ఖండాలకు వేటికవే ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నా ఈ మూడు ఖండాలలోని దేశాలలోని ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలు , వాటికి గల కారణాలు ఉమ్మడిగా చాలా ఉన్నాయి.

ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలను సామ్రాజ్య వాద దేశాలు , ముఖ్యంగా అమెరికా పీల్చి పిప్పి చేస్తున్నా , ఆయుధ బలంతో వనరులను దోచుకోవడం వల్ల బంధీలై ఉన్నా అక్కడ కొరకరాని కొయ్యగా క్యూబా నిలబడింది. మరో క్యూబాగా మరే ఇతర దేశమూ మారకూడదని , ఎక్కడ ఏ దేశంలో ఆకు కదిలినా , చీమ చిటుక్కు మన్నా మారణకాండ సృష్ఠిస్తు న్నాయి సామ్రాజ్యవాద దేశాలు లాటిన్ అమెరికా దేశాల్లో తమ నమ్మిన బంటులను అందలం ఎక్కించి పాలన చేస్తున్నాయి . స్థానికంగా అక్కడ ప్రభుత్వం మార్పునకో, లేక రాజకీయంగా గద్దె దింపే ప్రయత్నం జరుగుతున్నది అని తెలియగానే అమెరికా కన్నెర్ర చేసి బాంబులతో నేరుగా దాడి చేస్తుంది. క్యూబా అనగానే చేగువెరా గుర్తుకు రాక తప్పదు. ” మా ప్రాణాలైనా వదులు కుంటాం గాని , సోషలిజాన్ని విడువం ” అనే మాటలు నేటికీ క్యూబా లో వినిపిస్తూనే ఉంటాయి. ఈ సోషలిస్ట్ చైతన్యమే నేటికీ క్యూబాలో సోషలిజాన్ని కాపాడుతోంది. అందరికి ఇల్లు , అందరికి చదువు , అందరికి వైద్యం , అందరికి ఉపాది అనేవి రాజ్యాంగంలో ప్రాధమిక హక్కులుగా అమలవుతున్నాయి . పని చేసే వారిలో అసమానతలు అనేవి ఉండవు. డైలీ, క్యాజువల్ పని వారు అనే పద్ధతి అక్కడ లేదు. అందరూ శాశ్వత ఉద్యోగులే . ప్రజలంతా ఆరోగ్యంగా, బలిష్ఠంగా ఉంటారు.

ఎందుకు క్యూబా (Cuba) ప్రజలు సోషలిజం వైపు ఆకర్షితులైనారు?

వారిని సోషలిజం వైపున కట్టి పడవేసిన పరిస్థితులు ఏమిటి? అక్కడి నాయకత్వం సోషలిజాన్నే ఎందుకు నమ్ము కుంది ? అని తెల్సుకోవాలి అంటే అప్పటి విప్లవ నాయకులు ప్రధనంగా ముగ్గురు ప్రజల వెన్నంటి ఉండి విప్లవాన్ని నడిపించారు . వారే చేగువెరా , ఫిడెయిల్ కాస్ట్రో , ఆయన తమ్ముడు రౌల్ కాస్ట్రో ఉన్నారు . చేగువెరా జీవితం నాటికీ , నేటికీ ఎందరికో స్పూర్తి దాయకం . ఆయన తన డైరీలో వ్రాసుకున్న చివరి అక్షరాలు లాటిన్ అమెరికా గతినే మార్చి వేసాయి . ఆ వ్యాఖ్యలే క్యూబా యువతరానికి దిక్సూచిగా మారాయి. ” నేను ఇక ప్రజలతోటే ఉంటాను , అన్ని అడ్డంకులు , ఆటంకాలు ఉన్నా అన్నిటినీ దాటుకుంటూ , ఎంతమంది గొంతు చించుకుని ఏడ్చినా, కసితో నా కత్తిపై బలి ఇస్తాను ” అని ఆ పదాలను ముగించాడు. బొలీవియాలో విప్లవాన్ని తీసుకు రావడానికి తన మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి , చివరకు కాస్ట్రో కు కూడా చెప్పకుండా వెళ్ళి పోయాడు. ఆ బొలీవియా విముక్తిలో జరిగిన పోరాటంలో అమెరికా చేతిలో బలై పోయాడు. ఆ యాత్రలో ఉండగా వ్యాసుకున్న పదాలే అవి . ఆ పదాలే నేటికీ క్యూబా రాజకీయ నాయకులకు వేద మంత్రాలై వెలుగొందుతున్నవి. చేగువీర, బలిదానం తోటి క్యూబా ప్రజల్లో త్యాగశీలిగా ఖ్యాతి నొందాడు. సోషలిజం అభివృద్ధికి ఎంతో కృషి చేసాడు , సోషలిజం అంటే ఎలా ఉండాలో చూపించాడు. చే ఆలోచనా విధానాలనే కాస్ట్రో అమలు చేసాడు.

చే పరిశ్రమల మంత్రి హోదాలో భారత్ పర్యటన చేసి , భారత్ – క్యూబా మైత్రిని బలపడే విధంగా భారతీయుల హృదయాలను జయించాడు . ఎన్ని ప్రభుత్వాలు మారినా భారతీయులు క్యూబా పట్ల ప్రేమ , అభిమానం చెక్కు చెదర లేదు. ఇప్పటికి కూడా క్యూబా ప్రజల నినాదం ఒకటే . మా ప్రాణాలైనా వదులుతాం , సోషలిజాన్ని వదలుకోం అంటారు. క్యూబాలో 12 రకాల వ్యాక్సిన్ లు అందరికీ ఉచితంగా అందించ బడ తాయి . వైద్య సేవలు అందించే వైద్యుల నిష్పత్తి ప్రపంచ దేశాల అన్నిటిలోకి ఎక్కువ. కరోనా కాలంలో వారి వైద్య సేవలను ప్రపంచం గుర్తించింది. ఎంతగా గుర్తించిందీ అంతే మానవత్వం అనేది కమ్యూనిస్ట్ లకే సాద్యం అనేంతగా. ఈ మాట అన్నది ఒక సామ్రాజ్యవాద దేశమైన బ్రిటీష్ ప్రభుత్వం . ఒక బ్రిటీష్ నౌక లో కోవిడ్ బాధితులకు క్యూబా వైద్యులు అందించిన సేవలను చూసి ప్రపంచమే అబ్బుర పడింది. ప్రతి వెయ్యి మందికి కనీసం ఒక డాక్టర్ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

భారత్ లో 10 వేల మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. కానీ క్యూబాలో వెయ్యి మందికి 8 మంది డాక్టర్లు ఉంటారు . క్యూబా విప్లవానికి 65 సం.ల ఘన చరిత్ర ఉంది. పక్కలో బల్లెంలా క్యూబాకు అమెరికా కేవలం తొంబై మైళ్ళ దూరంలోనే ఉంది. అయినా సోషలిజాన్ని నిలుపుకుంటోంది క్యూబా. నిరంతరం క్యూబా ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. నేటికీ తీవ్ర ఆంక్షల వలలో క్యూబా చిక్కుకునే ఉంది. మందులు , పసిబిడ్డలకు పాలపొడి లాంటివి కూడా దిగుమతులు చేసుకోనివ్వగుండా ఆంక్షలు విధిస్తున్నాయి . అయినా తన ఆస్థిత్వాన్ని కాపాడుకుంటూ స్వయంగా ప్రతిదీ తయారుచేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఒకసారి అమెరికా అధ్యక్షుడైన కెన్నడీ , క్యూబా అధ్యక్షుడైన కాస్ట్రో తో నీవు వంద కి.మీ దూరంలో మాత్రమే ఉన్నావని గుర్తుంచుకో , జాగ్రత్త అని హెచ్చరించాడట. దానికి కాస్ట్రో నీ అమెరికా కూడా మాకు అంతే దూరంలో ఉందని గుర్తిస్తే మంచిది అని తిరుగు సమాధానం ఇచ్చాడట. 2017 లో ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు ప్రవేశ పెట్టింది. ప్రభుత్వం చేపట్ట దలచిన ప్రతి పనినీ ప్రజల ముందు ఉంచి , చర్చించాలనేది ఒక నియమగా పెట్టుకున్నారు.

దీన్ని ప్రజలు ఏ నిర్ణమయినా ఇది మన సమస్య, ఇది మన సొంత నిర్ణయం అని తూ చ తప్పక పాటిస్తూ ఉంటారు. . వేల కి.మీ దూరంలో ఉన్న ఇరాన్ , ఇరాక్ , ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను చీల్చి , సైన్యాన్ని పంపి , ప్రభుత్వాలను కూల్చింది అమెరికా. సోవియట్ , యూరోప్ దేశాల్లో కుట్రలు చేసి సోషలిజాన్ని పడగొట్టింది. గోర్బచెవ్ చేపట్టిన పెరిస్ట్రోయికా , గ్లాస్ నాస్త్ విధానాలను ఆనాడే కాస్ట్రో తప్పుబట్టాడు. వర్గ సంకర విధానాల వల్ల రష్యాలో సోషలిజం దెబ్బతినక తప్పదని ముందుగానే హెచ్చరించాడు. ఆయన ఊహించిన విధంగానే సోవియట్ విచ్చిన్న మైనది . కానీ క్యుబాలో సోషలిజం సామ్రాజ్య వాద వ్యతిరేక పునాదులపై నిర్మింపబడ్డది. అందుకే నేటికీ క్యూబాలో సోషలిజం చెక్కు చెదరగుండా ఉంది. అమెరికా ప్రపంచాన్ని గుప్పెట పెట్టుకుని ఆడిస్తోంది గానీ , పక్కనే సరిహద్దులో ఉన్న క్యూబాను ఏమీ చేయలేక పోతోంది . క్యూబాలో చెరకు , కాఫీ వ్యవసాయం ప్రధాన పంటలు , టూరిజం ఆదాయ వనరు.

1992 లో సోవియట్ విచ్చిన్నం తరువాత క్యూబాకు రష్యాతో సంబంధాలు తెగిపోయాయి . ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. అప్పుడు భారత్ ఒక లక్ష టాన్నుల ఆహార ధాన్యాలను హవానా పోర్టుకు పంపింది . దానికి కాస్ట్రో భారత్ నుండి లక్ష టన్నుల ఆహార ధాన్యాలు వచ్చినా , అంతకంటే లక్షల టన్నుల ప్రజల అభిమానం మాకు అందిందని ప్రకటించాడు కాస్ట్రో. ప్రపంచంలో వరల్డ్ ఫండ్ ఫర్ నేచుర్ అందుకుం టున్న ఏకైక దేశం క్యూబా . వైద్య రంగంలో క్యూబా అంత పట్టు ఎలా సాధించిందో అధ్యానం చేయాలి.

Also Read:  MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓటర్ల హవా

Telegram Channel

Tags  

  • america
  • Cuba
  • Revolution
  • russia
  • Socialism
  • USA
  • USSR
  • world
  • World Map
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

America:అమెరికాలోని కేతుంకిలో ఢీకొన్న రెండు ఆర్మీ హెలికాప్టర్లు. 6గురు సైనికులు మృతి

America:అమెరికాలోని కేతుంకిలో ఢీకొన్న రెండు ఆర్మీ హెలికాప్టర్లు. 6గురు సైనికులు మృతి

అమెరికాలో (America) ఘోర ప్రమాదం జరిగింది. రెండు సైనిక హెలికాఫ్టర్లు గగనతలంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో 6గురు సైనికలు మరణించినట్లు తెలుస్తోంది. సైనికులకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కెంటకీ రాష్ట్రంలో నిన్న అర్థరాత్రి 10గంటలకు రెండు హెలికాఫ్టర్లు ఢీకొన్నట్లు సైనాన్ని ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. BREA

  • Dasara Premieres: యూఎస్ లో దసరా దూకుడు.. మహేశ్, బన్నీ రికార్డులు బద్దలు!

    Dasara Premieres: యూఎస్ లో దసరా దూకుడు.. మహేశ్, బన్నీ రికార్డులు బద్దలు!

  • Loneliness & Silence: ఒంటరితనమే లోకం.. నిశ్శబ్దమే బంధువుగా వృద్ధుల టౌన్

    Loneliness & Silence: ఒంటరితనమే లోకం.. నిశ్శబ్దమే బంధువుగా వృద్ధుల టౌన్

  • Shooting chaos in America: అమెరికాలో కాల్పుల కలకలం.. పక్కా ప్లాన్ తో ఎటాక్!

    Shooting chaos in America: అమెరికాలో కాల్పుల కలకలం.. పక్కా ప్లాన్ తో ఎటాక్!

  • World Trip in Bus: బస్సులో ప్రపంచ యాత్ర మీకు తెలుసా.. 22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు

    World Trip in Bus: బస్సులో ప్రపంచ యాత్ర మీకు తెలుసా.. 22 దేశాలు.. 56 రోజులు.. 12 వేల కిలోమీటర్లు

Latest News

  • Tripura BJP MLA: అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్యే.. ఎక్కడంటే..?

  • Jagan plan : మూడోసారి క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న‌,సీనియ‌ర్ల‌కు ఛాన్స్ ?

  • Philippine Ferry Fire: ఫిలిప్పీన్స్ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. 31 మంది మృతి

  • Jagan Delhi : ముగిసిన జ‌గ‌న్ ఢిల్లీ చ‌క్కర్లు, అసెంబ్లీ ర‌ద్దు?

  • Bird Flu: చిలీలో కలకలం.. మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు..!

Trending

    • Business Idea : మీ ఊరిలో ఖాళీ స్థలం ఉందా, ఈ పండ్ల తోటతో నెలకు రూ. 1 లక్ష పక్కా…పెట్టుబడి అవసరం లేదు…!

    • Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..

    • UPI Payment is Free: అంతా ఏప్రిల్ ఫూల్…యూపీఐ చార్జీల విషయంలో జరిగింది ఇదే…

    • UPI Payments: ఇకపై UPI ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: