Cow Beauty Pageants: ఆవులకు అందాల పోటీలు.
రంగురంగుల దుస్తులు, ఆభరణాలు ధరించి, సువాసనలు వెదజల్లే పువ్వులతో అలంకరించుకుని వయ్యారంగా ర్యాంప్ వాక్ చేస్తుంటే 'వయ్యారి భామ నీ హంస నడక' అనే పాట బాగా సెట్ అయ్యేలా ఉంది.
- By Maheswara Rao Nadella Published Date - 01:35 PM, Tue - 29 November 22

రంగురంగుల దుస్తులు, ఆభరణాలు ధరించి, సువాసనలు వెదజల్లే పువ్వులతో అలంకరించుకుని వయ్యారంగా ర్యాంప్ వాక్ చేస్తుంటే ‘వయ్యారి భామ నీ హంస నడక’ అనే పాట బాగా సెట్ అయ్యేలా ఉంది. అందాల పోటీ అంటే ఆ మాత్రం ఉండాలిలే అనిపిస్తుంది అందరికీ. అయితే అది ఆడవారి అందాల పోటీ కాదండోయ్. రష్యాలో జరిగిన కొత్తరకం అందాల పోటీ గురించి. వివరాల్లోకి వెళితే…
రష్యాలోని `యాకుటియా` అనే ప్రాంతంలో ఆవులకు అందాల పోటీలు నిర్వహించారు. 25 ఆవులు పోటీలో పాల్గొనగా అందులో 24 ఆవులను వెనక్కి నెట్టి “మిచియే” అనే ఆవు విజేతగా నిలిచింది. ఈ ఆవు పసుపు, ఆకుపచ్చ రంగు దుస్తులలో, పసుపు, ఎరుపు పువ్వులను అలంకరించుకుని న్యాయనిర్ణేతల మనసు దోచేసింది. రష్యాలో ఇలా ఆవులకు అందాల పోటీలు నిర్వహించడం ఇది రెండోసారి. గత ఏడాది జంట ఆవులు విజేతలుగా నిలవగా ఈసారి మాత్రం మిచియే విజేత అయ్యింది. ఈ ఆవుకు బహుమానంగా 40లీటర్ల పాలక్యాన్ ను ఇచ్చారట. అది ఆవు యజమానికి వెళ్ళింది. ఈ మిచియే ఆవు యాకుబ్, హియర్ ఫోర్డ్ అనే రెండు జాతుల కలయిక వల్ల జన్మించింది. అలంకరణలో ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఈ ఆవుకు ఇప్పుడు ప్యాన్స్, ఫాలోయర్స్ తయారయ్యారు. ఇప్పుడిది సెలబ్రిటీ హోదాను అనుభవిస్తోంది.