HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Coup In Bangladesh Against Yunus Army Holds Emergency Meeting

Yunus Vs Army : బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు ? యూనుస్ ఖేల్ ఖతం!

బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీని ప్రకటించాలని తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్‌‌పై(Yunus Vs Army) ఆర్మీ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

  • Author : Pasha Date : 25-03-2025 - 1:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Military Coup In Bangladesh Yunus Bangladesh army

Yunus Vs Army : త్వరలోనే బంగ్లాదేశ్‌లో సైనిక పాలన మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్‌తో విభేదాలు రావడంతో తిరుగుబాటు చేయాలని ఆర్మీ చీఫ్ వకారుజ్జమా సారథ్యంలోని  బంగ్లాదేశ్ ఆర్మీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వకారుజ్జమా సారథ్యంలో సోమవారం రోజు ఆర్మీ ఉన్నతాధికారులు  అత్యవసరంగా సమావేశమయ్యారు. తదుపరిగా ఏం చేయాలి ? మహ్మద్ యూనుస్ ప్రభుత్వంపై ఎలాంటి వైఖరిని తీసుకోవాలి ? అనే దానిపై వారు చర్చించారు. ఈ ఎమర్జెన్సీ  మీటింగ్‌లో ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, ఎనిమిది మంది మేజర్ జనరల్స్ (జీఓసీలు), స్వతంత్ర బ్రిగేడ్‌ల కమాండింగ్ ఆఫీసర్లు, ఆర్మీ హెడ్ క్వార్టర్ల ప్రధాన అధికారులు పాల్గొన్నారు.

Also Read :Rare Temples : ఏడాదిలో ఒక్కరోజే తెరుచుకునే ఆలయాలు ఇవే

తదుపరి ప్రణాళికలు ఇవీ.. 

బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీని ప్రకటించాలని తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్‌‌పై(Yunus Vs Army) ఆర్మీ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఎమర్జెన్సీని ప్రకటించగానే సైనిక పాలనను బంగ్లాదేశ్ ఆర్మీ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. తదుపరిగా తమ సారథ్యంలో దేశంలో ‘జాతీయ ఐక్యతా ప్రభుత్వం’ను ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ ఆర్మీ భావిస్తోంది. ఈ ప్రభుత్వంలో ఆర్మీ సూచించే వారికే అవకాశాలు దక్కుతాయి. తద్వారా దేశంలోని అన్ని విభాగాలపై ఆర్మీకి పట్టు దక్కుతుంది.

Also Read :Shihan Hussaini : పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ ఇక లేరు

ఆర్మీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు

అయితే ఆర్మీ వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నాలను బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.  షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీ తిరిగి పుంజుకునేలా చేసేందుకే ఆర్మీ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను సైన్యం ఖండించింది.బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు జరగొచ్చనే ఆందోళనల నేపథ్యంలో  తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్‌ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సంక్షోభ వాతావరణం నుంచి గట్టెక్కేందుకు  చైనా నుంచి దౌత్యపరమైన సాయాన్ని యూనుస్ అడుగుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై చైనా ఎలా స్పందిస్తుందనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • Bangladesh Army
  • Bangladesh Coup
  • Military Coup
  • Yunus
  • Yunus Vs Army

Related News

BCB- BCCI

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ద్ద ఎంత సంప‌ద ఉందంటే?

ఐసీసీ (ICC) రెవెన్యూ వాటాలో సింహభాగం బీసీసీఐకే దక్కుతుంది. బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ (ప్రసార హక్కులు) ద్వారా భారీ ఆదాయం వస్తుంది. 2023-28 కాలానికి గానూ వయాకామ్ 18 సంస్థతో రూ. 5,963 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

  • Bangladesh

    బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

  • Mustafizur Rahman

    కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

  • Hindu Man Dead

    బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందువు కాల్చివేత!

  • Bangladesh

    బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ‌!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!

  • నేటి నుంచే ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌.. తొలి మ్యాచ్ ఏ జ‌ట్ల మ‌ధ్య అంటే?

  • సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్

  • బిఆర్ఎస్ కు లభించిన మరో అస్త్రం! కాంగ్రెస్ కు మరో తలనొప్పి తప్పదా ?

  • అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్‌కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?

Trending News

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd