China Map – Israel : చైనా కంపెనీల మ్యాప్‌లలో ఇజ్రాయెల్ మాయం.. ఎందుకు ?
China Map - Israel : ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధం జరుగుతున్న వేళ చైనాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
- Author : Pasha
Date : 31-10-2023 - 2:06 IST
Published By : Hashtagu Telugu Desk
China Map – Israel : ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం జరుగుతున్న వేళ చైనాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనాకు చెందిన అలీబాబా, బైదు కంపెనీలు తమ వెబ్‌సైట్లలోని ఆన్‌లైన్ వరల్డ్ మ్యాప్‌లలో మార్పులు చేశాయి. నూతన మ్యాప్‌లో ఇజ్రాయెల్ పేరును చేర్చలేదు. ఇజ్రాయెల్ అంతర్జాతీయ సరిహద్దులు, పాలస్తీనా భూభాగాల గురించి ఈ మ్యాప్‌లలో ప్రస్తావన ఉంది. కానీ ఇజ్రాయెల్ మ్యాప్ దగ్గర ఆ దేశం పేరును ప్రచురించలేదు. ఈ మ్యాప్‌ల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాప్‌ల నుంచి ఇజ్రాయెల్ పేరును తొలగించడానికి అసలు కారణం ఏమిటి ? అనే దానిపై అలీబాబా, బైదు కంపెనీలు ఇంకా వివరణ ఇవ్వలేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంలో చైనా ఎవరి పక్షం కూడా వహించలేదు. మరోవైపు అమెరికా కూడా ప్రస్తుతం చైనాతో సన్నిహితంగానే ఉంటోంది. ఓ వైపు ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో.. మరోవైపు ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో ఇరుక్కుపోయిన అమెరికా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ఈ టైంలో చైనాతో పెట్టుకునే పరిస్థితి లేకపోవడంతో .. ఎంతో తెలివిగా పావులు కదుపుతోంది. దీంతో చైనా కూడా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ‘‘ఇజ్రాయెల్‌కు వారి దేశాన్ని రక్షించుకునే హక్కు ఉంది. కానీ ఆ హక్కును.. అంతర్జాతీయ మానవతా చట్టాలకు లోబడి పొందాలి’’ అని ఇజ్రాయెల్‌కు చైనా సూచిస్తోంది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మార్చడమే ఈ యుద్ధానికి ఏకైక పరిష్కారమని చైనా(China Map – Israel) వాదిస్తోంది.