Chinese Canadian singer: రేప్ కేసులో పాప్ సింగర్‌కు జైలు శిక్ష..!
ఓ బాలికపై అత్యాచారం కేసులో పాప్ సింగర్ క్రిస్ వూకు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది.
- Author : Gopichand
Date : 25-11-2022 - 6:22 IST
Published By : Hashtagu Telugu Desk
ఓ బాలికపై అత్యాచారం కేసులో పాప్ సింగర్ క్రిస్ వూకు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. డి మిజు అనే 17 ఏళ్ల బాలిక తనను అత్యాచారం చేశాడంటూ క్రిస్ వూపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని పోయిన ఏడాది జూలైలో అరెస్ట్ చేశారు. శుక్రవారం క్రిస్ తన నేరం ఒప్పుకోవడంతో చావోయాంగ్ జిల్లా కోర్టు అతనికి 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అత్యాచారం, ఇతర ఆరోపణలతో పాటు శుక్రవారం నేరాన్ని అంగీకరించిన చైనా-కెనడియన్ పాప్ స్టార్ క్రిస్ వూకు చైనా కోర్టు 13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
2020లో జరిగిన అత్యాచారం కేసులో క్రిస్ వూకు 11 సంవత్సరాల ఆరు నెలల శిక్ష విధించినట్లు బీజింగ్‌లోని చాయాంగ్ జిల్లా కోర్టు తెలిపింది. లైంగిక ఆరోపణల కేసులో ఒక సంవత్సరం 10 నెలల జైలు శిక్ష విధించబడింది. ఈ కేసు 2018 నాటిది. ఇందులో క్రిస్, మరో ఇద్దరు.. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అత్యాచారం కేసులో ముగ్గురు బాధితులు కూడా తాగి ఉన్నారని వారిని అడ్డుకోలేకపోయారని కోర్టు దృష్టికి తెచ్చింది. కోర్టు విడుదల చేసిన ఒక ప్రకటనలో.. వాస్తవాలు, నేరం, పరిస్థితులు, హానికరమైన పర్యవసానాల ప్రకారం కోర్టు ఈ నిర్ణయం ఇచ్చిందని పేర్కొంది.