Donald Trump Tariffs : ట్రంప్ కు భారీ షాక్ ఇచ్చినా చైనా
Donald Trump Tariffs : ఇక చివరిగా చైనా అమెరికా నుంచి దిగుమతి చేసే చికెన్‌పై కూడా ఆంక్షలు విధించడంతో, అమెరికా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బ తినే సూచనలు కనిపిస్తున్నాయి
- By Sudheer Published Date - 05:29 PM, Fri - 4 April 25

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ఇటీవల భారత్, చైనా (America VS China) వంటి అనేక దేశాలపై భారీ సుంకాలను (Tariffs ) విధించనున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు అమెరికా కు షాక్ ఇచ్చేందుకు అనేక దేశాలు సిద్ధం అవుతున్నాయి. ముందుగా చైనా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% సుంకాన్ని విధించనున్నట్లు చైనా అధికారికంగా తెలిపింది. ట్రంప్ గతంలో చైనా వస్తువులపై ఇదే స్థాయిలో సుంకాలు విధించగా, ఇప్పుడు అదే పద్ధతిలో చైనా కౌంటర్ ఇవ్వడం వాణిజ్య యుద్ధాన్ని మరింత ముదిరేలా చేస్తుంది.
Nagababu : పిఠాపురంలో నాగబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ శ్రేణులు
అంతేకాకుండా చైనా 11 అమెరికన్ కంపెనీలను “విశ్వసనీయత లేని సంస్థల” జాబితాలో చేర్చింది. దీనర్థం ఆ సంస్థలు ఇకపై చైనాలో వ్యాపారాలు నిర్వహించలేవన్న మాట. ఫలితంగా మిలియన్ల డాలర్ల విలువైన డిజిటల్, సాంకేతిక సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. పైగా అరుదైన భూమి మూలకాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు విధించడంతో, ప్రపంచంలోని టెక్ కంపెనీలు, డిఫెన్స్ రంగాలు కుదేలయ్యే ప్రమాదం ఉంది.
ఇక చివరిగా చైనా అమెరికా నుంచి దిగుమతి చేసే చికెన్‌పై కూడా ఆంక్షలు విధించడంతో, అమెరికా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బ తినే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న చర్యలు తాత్కాలికంగా అమెరికా ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం అనిపించినా, దీని ద్వారా ప్రపంచ వాణిజ్యంలో గందరగోళం పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పెరగడం, వినియోగదారులపై భారం పెరగడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ వాణిజ్య యుద్ధానికి పరిష్కారం ఏమై ఉంటుందన్నది ఆసక్తికర అంశం.