Nagababu : పిఠాపురంలో నాగబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ శ్రేణులు
Nagababu : జనసేన శ్రేణులు “జై జనసేన” అంటూ నినాదాలు చేయగా, టీడీపీ కార్యకర్తలు “జై వర్మ” అంటూ ప్రస్తుత పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు మద్దతుగా నినాదాలు చేశారు
- By Sudheer Published Date - 04:39 PM, Fri - 4 April 25

జనసేన ఎమ్మెల్సీ(Janasena MLC)గా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు(Nagababu).. తన తొలి అధికారిక పర్యటనను పిఠాపురం నియోజకవర్గం(Pithapuram Constituency) నుంచే ప్రారంభించారు. ఈ సందర్బంగా గోల్లప్రోలు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ప్రజలతో మమేకమవుతూ, అభివృద్ధి పనులను ప్రారంభించిన నాగబాబు పర్యటన తొలుత సౌహార్దపూర్వకంగా కొనసాగింది.
Sharmila : దొంగ పత్రాలు సృష్టించి అన్యాయం చేసిన వ్యక్తి జగన్ – షర్మిల ఘాటు వ్యాఖ్యలు
అయితే ఈ పర్యటనలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనసేన – తెలుగుదేశం మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు స్పష్టంగా బయటపడ్డాయి. నాగబాబు సమక్షంలో రెండు పార్టీ శ్రేణులు ఒకదానికొకటి పోటీగా నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. జనసేన శ్రేణులు “జై జనసేన” అంటూ నినాదాలు చేయగా, టీడీపీ కార్యకర్తలు “జై వర్మ” అంటూ ప్రస్తుత పిఠాపురం ఎమ్మెల్యే వర్మకు మద్దతుగా నినాదాలు చేశారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మపై చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని కలిగించాయి.
పరిస్థితిని మరింత ఉద్రిక్తతగా మార్చింది ఫ్లెక్సీల వ్యవహారం. నాగబాబు పర్యటన కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో వర్మ ఫొటో లేకపోవడం టీడీపీ శ్రేణులకు ఆగ్రహానికి దారి తీసింది. పైగా ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం ఇవ్వలేదన్న అభియోగాలు కూడా వినిపించాయి. మొత్తం మీద మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, టీడీపీ మధ్య పిఠాపురంలో విభేదాలు తీవ్రంగా ఉన్నాయని, ఈ విషయంలో పార్టీలు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.