Indian Students : భారత విద్యార్థులకు కెనడా బ్యాడ్ న్యూస్.. స్టడీ పర్మిట్లు తగ్గింపు
దీంతో కెనడా జాతీయుల(Indian Students) మెప్పును పొందేందుకు ట్రూడో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు.
- By Pasha Published Date - 09:54 AM, Thu - 19 September 24

Indian Students : కెనడాలో ప్రస్తుతం ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఈ సమస్యలను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇక నుంచి విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, విదేశీ వర్కర్లకు పని అనుమతులపై మరిన్ని ఆంక్షలను అమల్లోకి తెస్తామని వెల్లడించింది. ఈమేరకు ఎక్స్ వేదికగా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటన విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో విదేశీ విద్యార్థులకు 35శాతం తక్కువగా స్టడీ పర్మిట్లు ఇస్తామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది స్టడీ పర్మిట్ల సంఖ్యను మరో 10శాతం వరకు తగ్గిస్తామని చెప్పారు. కెనడా ఆర్థిక వ్యవస్థకు వలసలు ప్రయోజకరమే అయినప్పటికీ, కొన్ని దుష్ట శక్తులు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని నియంత్రించేందుకు తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.కెనడాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా చేపట్టిన సర్వేల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనుకంజలో ఉంది. దీంతో కెనడా జాతీయుల(Indian Students) మెప్పును పొందేందుకు ట్రూడో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు.
Also Read :Lebanon Explosions : పేజర్లు, వాకీటాకీల పేలుడు.. 32కు చేరిన మృతులు
- మొత్తం మీద కెనడా సర్కారు నిర్ణయంతో ఎంతోమంది భారత విద్యార్థులు కెనడాలో చదువుకునే అవకాశాన్ని, ఉద్యోగాలు పొందే ఛాన్స్‌ను కోల్పోనున్నారు.
- కెనడాలో చదువుకుంటున్న ఫారిన్ స్టూడెట్స్‌లో ఎక్కువ మంది ఇండియన్సే ఉంటారు.
- 2022లో కెనడా జారీ చేసిన స్టడీ పర్మిట్లలో 41శాతం భారతీయ విద్యార్థులే దక్కించుకున్నారు. భారత్‌కు చెందిన దాదాపు 13.35లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటుండగా, వారిలో 4.27లక్షల మంది ఒక్క కెనడాలోనే చదువుకుంటున్నారు.
- 2013 నుంచి 2022 మధ్య కాలంలో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 260శాతం పెరిగింది.
- 2023లో 5,09,390 మంది విదేశీ విద్యార్థులకు కెనడా స్టడీ పర్మిట్లు ఇచ్చింది.
- 2024 సంవత్సరంలో తొలి ఏడు నెలల్లో 1,75,920 మందికి కెనడా స్టడీ పర్మిట్లు ఇచ్చింది. కెనడాలో తాత్కాలిక నివాసితుల సంఖ్య రెండేళ్లలోనే డబుల్ అయింది.
- 2022లో 14లక్షల మంది తాత్కాలిక నివాసితులు కెనడాలో ఉండగా, 2024 జూన్ వరకు ఆ సంఖ్య 28లక్షలకు చేరడం గమనార్హం. అందువల్లే తమ దేశ జనాభాలో తాత్కాలిక నివాసితుల సంఖ్యను 5శాతానికి పరిమితం చేస్తామని కెనడా అంటోంది.