Prime Minister since 1985 : 38 ఏళ్లుగా ఆయనే ప్రధాని.. ఇకపై ఆయన కొడుకట.. నేడే కాంబోడియా పోల్స్
Prime Minister since 1985 : కాంబోడియా ప్రధాన మంత్రి 70 ఏళ్ల హున్ సేన్ (Hun Sen) గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.. ఎందుకంటే ఆయన 1985 సంవత్సరం నుంచి ఆ దేశ ప్రధానమంత్రి పోస్టులో ఉన్నారు.
- By Pasha Published Date - 07:58 AM, Sun - 23 July 23

Prime Minister since 1985 : కాంబోడియా ప్రధాన మంత్రి 70 ఏళ్ల హున్ సేన్ (Hun Sen) గురించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.. ఎందుకంటే ఆయన 1985 సంవత్సరం నుంచి ఆ దేశ ప్రధానమంత్రి పోస్టులో ఉన్నారు. వయసు మీద పడుతుండటంతో ఇకపై తన కొడుకు 45 ఏళ్ళ హున్ మానెట్ (Hun Manet)కి పీఎం పోస్టు ఇస్తానని ఆయన ప్రకటించారు. ఈసంచలన ప్రకటన నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) జరుగుతున్న కాంబోడియా ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రధాని రేసులో ఉన్న హున్ సేన్ కొడుకు హున్ మానెట్ ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారో వేచి చూడాలి. అయితే దేశ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు ? మళ్ళీ హున్ సేన్ కు చెందిన కంబోడియన్ పీపుల్స్ పార్టీ (CPP)కే పట్టం కడతారా ? మార్పును కోరుకుంటారా ? అనేది ఆసక్తికరంగా మారింది.
Also read : Mexico Bar: అమెరికాలో విషాద ఘటన.. బార్‌కు నిప్పంటించడంతో 11 మంది మృతి
ఈ ఎన్నికల కోసం ఓ వైపు సుడిగాలి ప్రచారం నిర్వహించిన హున్ సేన్(Prime Minister since 1985) .. మరోవైపు ప్రతిపక్ష పార్టీ నాయకుల ప్రచారాన్నిమాత్రం అడుగడుగునా అడ్డుకున్నారు. ఎంతోమంది విపక్ష నేతలను జైల్లో పెట్టారు. ప్రచారంలో పాల్గొనకుండా మరెంతో మందిపై ఆంక్షలు విధించారు. దీంతో ప్రచారంలో తనకు చెందిన కంబోడియన్ పీపుల్స్ పార్టీకి పైచేయి ఉండేలా జాగ్రత్తపడ్డారు. 2017లో కంబోడియా యొక్క అత్యున్నత న్యాయస్థానం ఏకంగా ప్రతిపక్ష పార్టీల కూటమి “కంబోడియన్ నేషనల్ రెస్క్యూ పార్టీ” (CNRP)ని నిషేధించింది. ఈక్రమంలో డజన్ల కొద్దీ CNRP నాయకులు జైలు పాలయ్యారు. ఈ ఏడాది ఎన్నికల ప్రచారం కూడా ఇదే తరహా అణచివేతతో సాగింది. 1985 నుంచి ఇదే విధమైన కుతంత్రాలతో ఎన్నికల్లో హున్ సేన్ గెలుస్తూ రాస్తున్నారు. హున్ సేన్ కు చైనాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Also read : National Highways: రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ఎలా ప్రకటిస్తారు..?