HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >British Prime Minister Keir Starmer Resigns

Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

  • Author : Vamsi Chowdary Korata Date : 22-06-2026 - 3:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
British Prime Minister Keir Starmer's resignation
British Prime Minister Keir Starmer's resignation

బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. కొంతకాలంగా పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, అధికార లేబర్ పార్టీలో వత్యిరేకతతో పదవి నుంచి తప్పుకోవాలని స్టార్మర్ నిర్ణయించుకున్నారు. దీంతో అధికార లేబర్ పార్టీలో నెలకున్న విబేధాలు కొత్త మలుపు తీసుకున్నాయి. యూకే ప్రధాని కార్యాలయం డౌనింగ్ స్ట్రీట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. ‘‘తన నిర్ణయం గురించి రాజుకు తెలియజేశాను… తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతాను’’ స్టార్మర్ తెలిపారు.

10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల స్టార్మర్ మాట్లాడుతూ.. తన నాయకత్వంపై వ్యతిరేకత, పార్టీలో తలెత్తిన అంతర్గత విబేధాలను అంగీకరించారు. ‘‘ లేబర్ పార్టీ ని ముందుకు నడిపించడానికి ఎవరు అత్యంత సమర్థులు అనేదే ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న అని నాకు తెలుసు. రాబోయే ఎన్నికలలో పార్టీకి నాయకత్వం వహించడానికి నేను సరైన స్థానంలో ఉన్నానా లేదా అని పార్టీ అడుగుతోంది… నా పార్టీ సహచరుల నుంచి నేను ఆ సమాధానం విన్నాను, దానిని నేను అంగీకరిస్తున్నాను. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం నేను ప్రేమించే దేశానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికే. అందుకే నేను లేబర్ పార్టీ నాయకుడిగా రాజీనామా చేస్తున్నాను…’’అని తెలిపారు.

‘‘నా నిర్ణయం గురించి రాజుకు తెలియజేశాను.. సెప్టెంబరులో జరిగే తదుపరి పార్లమెంట్ సమావేశానికి ముందే కొత్త నేత బాధ్యతలు స్వీకరించేలా ప్రక్రియను ప్రారంభించమని పార్టీ జాతీయ కార్యవర్గాన్ని కోరతాను… లేబర్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడానికి దోహదపడేలా, మరింత బలమైన బ్రిటన్‌ను నా వారసుడు వారసత్వంగా పొందుతాడని నాకు తెలుసు.. అందుకు పూర్తి మద్దతు ఇస్తాను. నాకు మద్దతు ఇచ్చిన నా సహచరులందరికీ ధన్యవాదాలు’’ అని ఆయన అన్నారు.

వరుస రాజకీయ ఎదురుదెబ్బలు, తగ్గుతున్న ప్రజా మద్దతు, లేబర్ పార్టీలో నాయకత్వ మార్పు కోసం పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో స్టార్మర్ భవిష్యత్తుపై సాగుతున్న ఊహాగానాల నడుమ ఆయన నుంచి రాజీనామా ప్రకటన వెలువడింది. 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీని విజయం దిశగా నడిపించిన స్టార్మర్.. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు ముగింపు పలికి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రభుత్వానికి మొదట్లో భారీ ప్రజా మద్దతు లభించినప్పటికీ, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవలు, పార్టీ అంతర్గత విభేదాల విషయంలో సవాళ్లను ఎదుర్కొంది.

స్టార్మర్ వారసుడిగా ఆండీ బర్న్‌హామ్‌ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. లేబర్ పార్టీలో బర్నహామ్‌కు మద్దతు ఇస్తున్న ఎంపీల సంఖ్య 300కు చేరుకుందని ది గార్డియన్ నివేదించింది. ఇక, జులై 2024లో కీర్ స్టార్మర్ యూకే ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. బ్రిటన్ 58వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మార్పు తీసుకువస్తానని స్టార్మర్ వాగ్దానం చేశారు. తన మొదటి ప్రసంగంలో మాజీ ప్రధాని రిషి సునక్ అంకితభావం, కృషిని కొనియాడారు.

ఇదిలా ఉండగా, పదవి నుంచి వైదొలగాలంటూ కీర్‌ స్టార్మర్‌పై కొన్నిరోజులుగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. లేబర్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గతుండగా.. నైజెల్‌ ఫరాజ్‌ నేతృత్వంలోని రిఫార్మ్‌ యూకే పార్టీకి భారీగా ఆదరణ పెరుగుతున్నట్లు సర్వేలు వెల్లడించాయి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amid Mounting Labour Party
  • British PM Keir Starmer
  • resigns
  • uk prime minister

Related News

    Latest News

    • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

    • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

    • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

    • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd