Pakistan : మసీదులో బాంబు బ్లాస్ట్
Pakistan : పాక్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఇటీవలే పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు
- By Sudheer Published Date - 07:27 PM, Fri - 14 March 25

పాకిస్థాన్ (Pakistan) మరోసారి బాంబు దాడి(Bomb Blast)తో ఉలిక్కిపడింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతుండగా, దక్షిణ వజీరిస్థాన్‌లోని అజామ్ వర్సాక్ (South Waziristan) ప్రాంతంలోని ఓ మసీదులో బాంబు పేలింది. ఈ ఘటనలో జమియత్ ఉలెమా ఇస్లాం (JUI) డిస్ట్రిక్ట్ చీఫ్ అబ్దుల్లా నదీమ్ తీవ్రంగా గాయపడగా, మరో వ్యక్తి కూడా గాయపడ్డారని సమాచారం. అయితే ఈ బాంబు దాడికి బాధ్యత ఎవరు వహించారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
SLBC Tunnel Incident: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఘటన.. సహాయక చర్యల పురోగతిపై సమీక్ష!
రంజాన్ మాసంలో ముఖ్యంగా రెండో శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు మసీదుకు చేరుకున్న నేపథ్యంలో ఈ పేలుడు జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పేలుడు ధాటికి అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. మసీదు సమీపంలోని కొన్ని భవనాలు, వాహనాలు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు, వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
Janasena Formation Day : హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ అన్న – లోకేష్
ఈ ఘటనతో సంబంధించి ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడు ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా ఉగ్రదాడి అనే అంశంపై పరిశీలన జరుగుతోంది. పాక్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఇటీవలే పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై, బాధ్యుల్ని త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.