Somalia: ప్లే గ్రౌండ్‌లో బాంబు బ్లాస్ట్.. 25 మంది చిన్నారులు మృతి
సోమాలియాలో అత్యంత విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఓ ప్లే గ్రౌండ్‌లో గుర్తు తెలియని బాంబు పేలడంతో 25 మంది అమాయక చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడ్డారు.
- Author : Praveen Aluthuru
Date : 10-06-2023 - 6:50 IST
Published By : Hashtagu Telugu Desk
Somalia: సోమాలియాలో అత్యంత విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఓ ప్లే గ్రౌండ్‌లో గుర్తు తెలియని బాంబు పేలడంతో 25 మంది అమాయక చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడ్డారు.
ఈ ఘటన దక్షిణ సోమాలియాలోని కొరియోలి పట్టణానికి సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనను స్థానిక అధికారులు ధృవీకరించారు. గ్రామంలోని బహిరంగ మైదానంలో చిన్నారుల ఆడుకుంటుండగా పేలుడు సంభవించినట్టు కుర్యోల్ టౌన్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ కమిషనర్ అబ్ది అహ్మద్ అలీ తెలిపారు. కోరోల్‌లోని ఆసుపత్రిలో 22 మంది చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయని, గాయపడిన వారిలో ఇద్దరు ఆసుపత్రికి తరలించిన తర్వాత మరణించారని అహ్మద్ తెలిపారు. మైనర్‌ల వయస్సు 10 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More: Hostel Girl: స్నానం చేస్తూ బాత్రూంలో పాటలు వినకూడదా? హాస్టల్ రూల్స్ పై నెటిజన్స్ ట్రోల్స్!