Twitter CEO: ట్విట్టర్ సీఈఓగా మస్క్ పెంపుడు కుక్క
ట్విట్టర్ అధినేత మస్క్ (Elon Musk) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెంపుడు కుక్క ఫ్లోకి ట్విట్టర్ సీఈఓ
- Author : Maheswara Rao Nadella
Date : 15-02-2023 - 12:10 IST
Published By : Hashtagu Telugu Desk
ట్విట్టర్ (Twitter) అధినేత మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెంపుడు కుక్క ఫ్లోకి ట్విట్టర్ సీఈఓ కుర్చీ లో కూర్చొబెట్టారు. దీనికి సీఈఓ రాసి ఉన్న టీ షర్ట్ను తొడిగారు. ట్విట్టర్ కొత్త సీఈఓ ఇతనే అంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఇదివరకు సీఈఓగా పని చేసిన భారతీయుడు పరాగ్ అగర్వాల్ కంటే తన కుక్క ఫ్లోకినే మెరుగ్గా పని చేస్తుంది అని కామెంట్ చేశారు . ఇలా పరాగ్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. న్యాయపోరాటం తర్వాత ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న మస్క్ అందులో పని చేస్తున్న కీలక వ్యక్తులపై చర్యలు తీసుకున్నాడు. ఈ డీల్ పూర్తయిన వెంటనే అగర్వాల్ ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ ఓ నెల్ సెగల్ ను తొలగించారు. వారిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ తన చేతిలోకి రాగానే అనేక మార్పులు చేశారు.
The new CEO of Twitter is amazing pic.twitter.com/yBqWFUDIQH
— Elon Musk (@elonmusk) February 15, 2023
Also Read: Sania Mirza: ఆర్సీబీ మహిళల జట్టు మెంటార్ గా సానియా మీర్జా నియామకం..!