HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Are Indians Hopes For America Dashed By Trumps Decision

America: ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారతీయుల అమెరికా ఆశలు గల్లంతేనా?

America: ప్రస్తుతం ఉన్న పౌరసత్వ పరీక్ష తేలికగా ఉందని, కేవలం జ్ఞాపకశక్తితో ఉత్తీర్ణత సాధించవచ్చని పేర్కొన్నారు. అందుకే పరీక్షను మళ్లీ గాఢంగా, విలువలపై ఆధారపడి ఉండేలా మార్చాలని భావిస్తున్నారు.

  • Author : Sudheer Date : 28-07-2025 - 2:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indians' Hopes For America
Indians' Hopes For America

అమెరికా(America)లో పౌరసత్వ పరీక్షను మరింత కఠినతరం చేయాలని ట్రంప్ (Trump) పరిపాలన భావిస్తుండటంతో భారతీయుల సహా అనేక మంది వలసదారుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో చేసిన ప్రకటన ప్రకారం… ప్రస్తుతం ఉన్న పౌరసత్వ పరీక్ష తేలికగా ఉందని, కేవలం జ్ఞాపకశక్తితో ఉత్తీర్ణత సాధించవచ్చని పేర్కొన్నారు. అందుకే పరీక్షను మళ్లీ గాఢంగా, విలువలపై ఆధారపడి ఉండేలా మార్చాలని భావిస్తున్నారు. ట్రంప్ 2020లో చేసిన మార్పులనేపేరుతో అదే పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

అమెరికా పౌరసత్వాన్ని పొందాలంటే, గ్రీన్‌కార్డ్ ఉన్న వారు ‘నాచురలైజేషన్ టెస్ట్’ రాయాల్సి ఉంటుంది. ఇందులో N-400 ఫారంతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ చెక్, అర్హతలు వంటి ఇతర ప్రక్రియలు ఉంటాయి. చివరగా ఇంటర్వ్యూలో భాగంగా ఇంగ్లీష్ భాషా నైపుణ్యం మరియు పౌరశాస్త్రం (సివిక్స్‌)పై పరీక్ష ఉంటుంది. ఇప్పటికీ అమల్లో ఉన్న విధానం ప్రకారం 100 ప్రశ్నల జాబితాలో నుంచి 10 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో కనీసం 6 ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

Pahalgam Attack : ఇది కదా వార్తంటే.. ముగ్గురు పహల్గామ్ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌

అయితే ట్రంప్ తొలి పాలనలో 2020లో ఈ పరీక్షను కఠినతరం చేస్తూ 128 ప్రశ్నల జాబితా ప్రవేశపెట్టారు. పరీక్షలో 20 ప్రశ్నలు అడిగేవారు, అందులో 12కి సరైన సమాధానాలిచ్చినవారే ఉత్తీర్ణులయ్యేవారు. ఆ విధానం విమర్శల కారణంగా తొలగించబడినప్పటికీ, ఇప్పుడు మళ్లీ అదే విధానాన్ని అమలు చేయాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పులు పౌరసత్వాన్ని ఆశిస్తున్న వలసదారులకు ఒక విధంగా అడ్డంకిగా మారవచ్చు.

ఇది సరిపోదన్నట్టు H-1B వీసాల విషయంలో కూడా పెద్ద మార్పులు జరుగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకారం ఇకపై H-1B వీసాలు కేవలం అధిక నైపుణ్యం, ఎక్కువ జీతాలు ఉన్న ఉద్యోగాలకే పరిమితమవుతాయి. దీని ద్వారా తక్కువ జీతాలకు విదేశీయులను నియమించడాన్ని నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, యువతపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాలో కెరీర్‌ను స్థిరపరచాలని కలలు కనే వారికి ఇది నిరాశ కలిగించొచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • America Vissa
  • indians
  • Trump decision

Related News

New Jersey

చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

New Jersey  అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో అడుగుపెట్టడమే కాకుండా అక్కడ పసిపిల్లలపై పైశాచికత్వం ప్రదర్శించిన ఓ భారతీయుడి ఉదంతం ఇప్పుడు కలకలం రేపుతోంది. న్యూజెర్సీలో 13 ఏళ్ల లోపు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఓడెల యశస్వీ కొత్తపల్లి అనే యువకుడిని అధికారులు కటకటాల్లోకి నెట్టారు. అంతేకాకుండా జైలుకు పంపడమే కాకుండా తిరిగి భారత్‌కు బహిష్కరించేందుకు చట్టపరమైన చర్యలు

  • Got India's commitment to stop buying Russian oil

    రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్‌ హామీ..అమెరికా కామెంట్లు

  • Rahul Gandhi

    రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

  • Seattle agrees to pay $29 million compensation to Kandula Jahnavi family

    జాహ్నవి కందుల కుటుంబానికి 264 కోట్ల పరిహారం

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd