HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Are Diesel And Petrol Prices Going To Increase In India

భారత్ లో డీజిల్, పెట్రోలు పెరగనున్నాయా?

  • Author : Vamsi Chowdary Korata Date : 03-03-2026 - 1:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India Petrol Diesel Crisis
India Petrol Diesel Crisis

India Petrol Diesel Crisis  పశ్చిమాసియాను కమ్ముకున్న యుద్ధ మేఘాలు సామాన్య భారతీయుడి జేబుపై, వంటింటిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు దాదాపుగా స్తంభించిపోవడమే దీనికి ప్రధాన కారణం. సాధారణంగా రోజుకు 19.8 మిలియన్ బారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా కావాల్సి ఉండగా ఈ నెల 1 నాటికి అది ఏకంగా 86 శాతం పడిపోయి కేవలం 2.8 మిలియన్ బారెళ్లకు చేరుకుంది. చమురు సరఫరాలో అంతరాయం ఇలాగే కొనసాగితే, దేశీయ అవసరాల దృష్ట్యా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎల్పీజీ రేషనింగ్:
భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 80-85 శాతాన్ని గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత నిల్వలు కేవలం రెండు వారాలకు మాత్రమే సరిపోతాయని అంచనా. ఈ నేపథ్యంలో గృహ అవసరాలకు సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం ‘రేషనింగ్’ (పరిమిత సరఫరా) విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కోత:
భారత్ తను ఉత్పత్తి చేసే పెట్రోల్‌లో మూడో వంతు, డీజిల్‌లో నాలుగో వంతు విదేశాలకు ఎగుమతి చేస్తుంది. దేశీయంగా కొరత రాకుండా ఉండటం కోసం ఈ ఎగుమతులను నిలిపివేసి, ఆ నిల్వలను స్థానిక వినియోగానికే మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.

చమురు నిల్వల పరిస్థితి ఏంటి..
కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. భారత్ వద్ద ప్రస్తుతం ఉన్న వ్యూహాత్మక నిల్వలు, రిఫైనరీలు మరియు ఓడరేవుల్లోని నిల్వలు కలిపి సుమారు 74 రోజుల అవసరాలకు సరిపోతాయని ఆయన తెలిపారు. ముడి చమురు నిల్వలు: 17-18 రోజుల వరకు, శుద్ధి చేసిన ఇంధనాలు: 20-21 రోజుల వరకు, ఎల్ఎన్జీ నిల్వలు: 10-12 రోజుల వరకు సరిపోతాయి.

ప్రత్యామ్నాయ మార్గాల వేట..
గల్ఫ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో భారత్ ఇప్పుడు రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను మరింత పెంచుకోవాలని చూస్తోంది. అలాగే అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి చమురు సేకరణకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం ‘‘రోజుల పాటు కాదు, వారాల పాటు’’ సాగే అవకాశం ఉందని హెచ్చరించడం భారత్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలకు ఇంధన లభ్యతలో ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crude oil imports India
  • fuel export restrictions
  • Hardeep singh puri
  • Hormuz Strait
  • India oil reserves
  • India petrol diesel crisis
  • LPG rationing
  • oil crisis
  • petrol diesel shortage
  • Russia oil supply

Related News

Donald Trump

Donald Trump: ఇరాన్ డీల్‌ విషయంలో ఒప్పందానికి తొందరేం లేదు: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు పూర్తయిందని ఆదివారం ప్రకటించిన ఆయన, తాజాగా ఆ మాటకు భిన్నంగా మాట్లాడారు. ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో ఓ పోస్ట్ చేశారు. “చర్చలు సక్రమంగానే సాగుతున్నాయి. కానీ ఒప్పందం విషయంలో తొందరపడబోము. చ

  • Fuel and LPG Shortage in the State?

    Petrol Diesel Shortage: రాష్ట్రంలో ఇంధనం, ఎల్పీజీ కొరత..?

  • A Crisis Is Looming... Oil Market Enters the 'Red Zone'

    Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd