Apple Watch: చిన్నారి ప్రాణాలు రక్షించిన యాపిల్ వాచ్..!
Apple టెక్నాలజీ ప్రజల జీవితాలను రక్షించడంలో అనేక సార్లు ఉపయోగపడింది.
- Author : Gopichand
Date : 23-10-2022 - 9:07 IST
Published By : Hashtagu Telugu Desk
Apple టెక్నాలజీ ప్రజల జీవితాలను రక్షించడంలో అనేక సార్లు ఉపయోగపడింది. ఈసారి ఒక బాలిక కుటుంబం పిల్లల్లో అరుదుగా కనిపించే క్యాన్సర్‌ని కనుగొనడంలో apple కంపెనీ వాచ్ సహాయం చేసింది. అమెరికాలో యాపిల్ వాచ్ ఓ బాలిక ప్రాణాలు కాపాడింది. ఇమాని మైల్స్ (12) అనే చిన్నారి హార్ట్‌బీట్ ఒక్కసారిగా పెరగడంతో ఆమె పెట్టుకున్న యాపిల్ వాచ్ అలర్ట్ చేసింది. ఇమాని మైల్స్ పెట్టుకున్న ఆపిల్ వాచ్ అసాధారణంగా అధిక హృదయ స్పందన రేటు గురించి 12 ఏళ్ల బాలికను హెచ్చరించడం ప్రారంభించింది.
ఇది గమనించిన మైల్స్ తల్లి జెస్సికా చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లింది. చిన్నారిని పరిశీలించిన వైద్యులు అపెండిక్స్‌లో ట్యూమర్ ఉందని, అది పెరుగుతూ ఇతర అవయవాలకు విస్తరిస్తున్నట్లు గుర్తించారు. ఇది పిల్లలలో చాలా అరుదుగా కనిపిస్తుందని డాక్టర్లు తెలిపారు. క్యాన్సర్ అప్పటికే మైల్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందని వైద్యులు తెలుసుకున్నారు. మిగిలిన క్యాన్సర్‌ను తొలగించడానికి ఆమెకు C.S మోట్ చిడ్రెన్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స చేసి ఆ ట్యూమర్‌ను డాక్టర్లు తొలగించారు.