Trump Tariffs : భారత్ మరో సంచలన నిర్ణయం
Trump Tariffs : ఇప్పటికే 3.6 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందాలను నిలిపివేసిన భారత్, తాజాగా రక్షణ రంగంలోనూ కీలకమైన నిర్ణయం తీసుకుంది
- By Sudheer Published Date - 05:03 PM, Fri - 8 August 25

ట్రంప్ ప్రభుత్వం (Trump Govt) విధించిన అధిక టారిఫ్‌లకు ప్రతిస్పందనగా భారత్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే 3.6 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య ఒప్పందాలను నిలిపివేసిన భారత్, తాజాగా రక్షణ రంగంలోనూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి ఆయుధాలు, క్షిపణుల కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
KL Rahul: కేఎల్ రాహుల్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు!
ఈ పరిణామాల నేపథ్యంలో భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక రక్షణ ఒప్పందాలపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే ట్రంప్ టారిఫ్‌ల కారణంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ పర్యటన రద్దు చేసుకోవడం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయనే సంకేతాలను పంపుతోంది.
ట్రంప్ ప్రభుత్వం విధించిన ఈ టారిఫ్‌లు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతిగా భారత్ కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ సంబంధాలపై మరింత ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎప్పుడు సమసిపోతాయో వేచి చూడాలి.