America Nanny Job : పిల్లలను చూసుకోవడానికి ఆయా కావాలి..నెలకు జీతం రూ.83 లక్షలు
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి వివేక్ రామస్వామి తన ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు ఆయా కోసం చూస్తున్నారు. అతను భారతీయ సంతతికి చెందిన బిలియనీర్
- Author : Sudheer
Date : 05-10-2023 - 4:07 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం సమాజంలో అంత బిజీ లైఫ్ కు..సంపాదన కు అలవాటుపడ్డారు. ఉదయం లేచినదగ్గరి నుండి పడుకునే వరకు అంత ఎవరికీ వారు ఉద్యోగాలు , పనులతో బిజీ గా గడుపుతున్నారు. ఈ క్రమంలో పుట్టిన పిల్లలను చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పిల్లలను కనడం ఒకెత్తు అయితే పెంచి పెద్ద చేయడం..వారి అలనాపాలన చూసుకోవడం మరో ఎత్తు..అందుకే ఈ బిజీ లైఫ్ లో కొంతమంది పిల్లలను కనడం కూడా మానేసి..డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డారు. మరికొంతమంది మాత్రం ఇంట్లో ఆయాలను పెట్టి పిల్లలను చూసుకునే బాధ్యత వారికీ అప్పజెప్పి వారి పనులు వారు చేసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో ఓ బిజినెస్ మాన్ ఇంట్లో తన పిల్లలను చూసుకోవడానికి ఓ మంచి ఆయా (Nanny ) కావాలని ప్రకటన చేసాడు. అది కూడా నెలకు రూ. 83 లక్షల జీతం (1 lakh dollars i.e. 83 lakh rupees)ఇస్తానని తెలిపి అందరికి షాక్ ఇచ్చాడు. కాకపోతే మన ఇండియాలో కాదు అమెరికాలో. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి (Republican Party Presidential Candidate) వివేక్ రామస్వామి (Vivek Ramaswamy ) తన ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు ఆయా కోసం చూస్తున్నారు. అతను భారతీయ సంతతికి చెందిన బిలియనీర్. దీని కోసం రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ప్రకటనలు ఇచ్చాడు. అమెరికన్ మీడియా బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. ఎంపికైన అభ్యర్థికి 1 లక్ష డాలర్లు అంటే 83 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటనలో సమాచారం ఇవ్వబడింది. ఈ ఉద్యోగం EstateJobs.comలో ఇవ్వబడింది.
ఇంట్లో ప్రతి రోజు ఆయా రొటేషన్ పద్ధతిలో పని చేయాలనీ.. వారంలో ఒక రోజు సెలవు ఉంటుందని. ఇది కాకుండా, మీరు ప్రతి వారం కూడా ప్రయాణించవలసి ఉంటుందని తెలిపారు. ఇందులో వారంవారీ కుటుంబ ప్రయాణం, ప్రైవేట్ విమాన ప్రయాణం ఉంటాయి. పిల్లల వస్తువులను ప్యాకింగ్, అన్ ప్యాక్ చేసే బాధ్యత కూడా ఆయాదే అని తెలిపారు. ఆయా వయసు కనీసం 21 సంవత్సరాలు ఉండాలని ప్రకటన లో తెలిపారు. ఈ ప్రకటన చూసి పెద్ద ఎత్తున ఆయా పోస్ట్ కు అప్లయ్ చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండడం తో మనదగ్గర కూడా ఇలాంటి జాబ్స్ ఇస్తే బాగుండు..నెలకు 83 లక్షలు వద్దు కానీ కనీసం రూ. 50 వేలు ఇచ్చిన బాగుండని కోరుతున్నారు.
Read Also : Sradda Das : గ్లామర్ షోకు తెరలు తొలగించిన శ్రద్దా దాస్