Child Shot His Sister: అలాంటి తుపాకీ అనుకొని కాల్చిన చిన్నారి.. స్పాట్ లో అవుట్ !
అమెరికాలో గన్ కల్చర్ గురించి మనకు తెలిసిందే. దానివల్ల అక్కడ ఏడాదికి వందల ప్రాణాలు పోతున్నాయి. ఈ మధ్య కాలంలో గన్ కల్చర్ పెరిగి, హత్యలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా అమెరికాలో తాజాగా ఓ దిగ్భ్రాంతికరమైన
- By Nakshatra Published Date - 09:55 PM, Mon - 13 March 23

Child Shot His Sister: అమెరికాలో గన్ కల్చర్ గురించి మనకు తెలిసిందే. దానివల్ల అక్కడ ఏడాదికి వందల ప్రాణాలు పోతున్నాయి. ఈ మధ్య కాలంలో గన్ కల్చర్ పెరిగి, హత్యలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా అమెరికాలో తాజాగా ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుం ది. ఒక తుపాకీని ఆట వస్తువు అనుకున్న మూడేళ్ల చిన్నారి పొరపాటున తన అక్క వైపు గురి పెట్టి పేల్చింది.
హ్యూ స్టన్ ప్రాంతంలోని టామ్‌బాల్ పార్క్ వే సమీపంలో ఒక కుటుంబం నివసిస్తోంది. వీరిలో ఇద్దరు చిన్నారులు. ఒకరు మూడేళ్ల చిన్నారి, మరొకరు నాలుగేళ్ల అమ్మా యి ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఈ ఇద్దరు చిన్నారులు ఒక బెడ్‌రూమ్‌లో ఆడుకుంటుండగా.. ఇతర కుటుంబ సభ్యులు వేరే గదుల్లో తమతమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.
ఆ చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో మూడేళ్ల పాపకు గదిలో ఒక ఫుల్ లోడెడ్ గన్ దొరికింది. అది ఎంత ప్రమాదకరమైందో ఆ చిన్నారికి తెలీదు. అది కూడా ఒక ఆట వస్తువే అని అనుకుంది. ఆ తుపాకీ తీసుకొని, తన అక్క వైపు గురి పెట్టి కాల్చింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆ చిన్నారి అక్కడే మృతిచెందింది. గన్ పేలిన శబ్దం విన్న పెద్దలు. వెంటనే గదిలోకి వచ్చిచూశారు. రక్తపు మడుగులో పడివున్న ఆ చిన్నారిని.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్ప టికే ఆ పాప ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యు లు ధృ వీకరించారు. ఇది విన్న కుటుంబం తల్లడిల్లిపోయింది.

Related News

Gun Culture Ban: గన్ లైసెన్స్ ఎవరికి ఇస్తారు? భారత ఆయుధ చట్టం ఏం చెబుతోంది?
గన్ లైసెన్స్ ఇప్పుడు ఈ టాపిక్ పై హాట్ డిబేట్ నడుస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో అత్యధికంగా 3.73 లక్షల పైచిలుకు గన్ లైసెన్సులు ఉన్నట్లు వెల్లడి కావడం కలకలం..