Russia-Ukraine War : ఉక్రెయిన్ ఫై మరోసారి దాడి చేసిన రష్యా
రష్యా క్షిపణిని ప్రయోగించడంతో ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో ఉన్న పోస్టల్ డిపో భవనం ధ్వంసమైంది
- By Sudheer Published Date - 08:01 AM, Sun - 22 October 23

ఉక్రెయిన్ – రష్యా (Russia-Ukraine War) ల మధ్య గత ఏడాది భీకర యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో వందలమంది చనిపోగా..వేలకోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ యుద్ధం గురించి ఇప్పుడిప్పుడే ప్రజలు మరచిపోతున్న తరుణంలో మరోసారి ఉక్రెయిన్ ఫై రష్యా దాడికి దిగి వార్తల్లో నిలిచింది. తాజాగా రష్యా క్షిపణిని ప్రయోగించడంతో ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో ఉన్న పోస్టల్ డిపో (Mail Depot In Ukraine) భవనం ధ్వంసమైంది. అందులో పనిచేస్తోన్న ఆరుగురు ఉద్యోగులు (Six dead) ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
భవనం శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర ఖర్కీవ్‌లోని బెల్గోరోడ్ () ప్రాంతంలో ఉన్న రష్యన్ బలగాలు ఎస్-300 క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో రెండు పోస్టల్ డిపోపై పడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోషల్‌మీడియాలో షేర్ చేసి , మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Also : TDP – JSP : రేపు టీడీపీ, జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ తొలిభేటీ