Road Accident in Texas : హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మృతి
టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు.. ఒకరు చెన్నైకి చందినవారు మరణించారు
- Author : Sudheer
Date : 03-09-2024 - 6:41 IST
Published By : Hashtagu Telugu Desk
ఉన్నంత చదువుల కోసం అమెరికా (America) వెళ్లిన భారతీయులు (Indians) పలు సంఘటనలతో మరణిస్తున్నారు. కొంతమంది అక్కడి వారి తుపాకీ తూటాలకు బలి అవుతుంటే..మరికొంతమంది పలు ప్రమాదాలతో కన్నుమూస్తున్నారు. తాజాగా టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident in Texas)లో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు.. ఒకరు చెన్నైకి చందినవారు మరణించారు. ఒకేసారి ఐదు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి(27),ఫరూక్ షేక్ (30), లోకేష్ పాలచర్ల (28) ఉండగా.. తమిళనాడుకు చెందిన దర్శిని వాసిదేవన్ (25)గా గుర్తించారు. వీరంతా కలిసి బెంటన్‌విల్లేకు వెళ్లేందుకు కార్‌పూలింగ్ యాప్ ద్వారా కలిశారు.
We’re now on WhatsApp. Click to Join.
బెంటన్‌విల్లేలో నివాసం ఉంటున్న ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి డల్లాస్‌లోని తన బంధువు వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. లోకేశ్ పాలచర్ల తన భార్య వద్దకు బెంటన్‌విల్లేకు వెళ్లారు. ఆర్లింగ్టన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన దర్శిని వాసుదేవన్, బెంటన్‌విల్లేలోని తన మామను చూడటానికి వెళుతున్నారు. ఈ బృందం కార్‌పూలింగ్ యాప్‌ని ఉపయోగించి ఒకే కారులో ప్రయాణం చేస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న SUVని వేగాన్ని కంట్రోల్ చేయలేక ముందున్న ట్రక్కు ఢీ కొన్నారు. దీంతో వీరంతా అక్కడిక్కడే మృతి చెందారు.
Read Also : NTR- Lokesh : జూ. ఎన్టీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్