Mass Shooting In Philadelphia: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు..!
తాజాగా ఫిలడెల్ఫియా (Mass Shooting In Philadelphia)లో కాల్పుల కేసు నమోదైంది. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇక్కడ జరిగిన సమావేశంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయపడ్డారు.
- By Gopichand Published Date - 10:33 PM, Sun - 21 July 24

Mass Shooting In Philadelphia: అమెరికాలో కాల్పుల ఘటనల్లో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్ త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి స్వల్ప గాయమైంది. అయితే ట్రంప్ దాడి జరిగిన వారం రోజుల వ్యవధిలోనే అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపుతోంది.
తాజాగా ఫిలడెల్ఫియా (Mass Shooting In Philadelphia)లో కాల్పుల కేసు నమోదైంది. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇక్కడ జరిగిన సమావేశంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలడెల్ఫియాలోని కారోల్ పార్క్ ప్రాంతంలో జరిగిన సమావేశంలో 100 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజలే లక్ష్యంగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. సమీపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Elderly Population In India: 2050 నాటికి భారతదేశంలో ఎక్కువ ఉండేది వృద్ధులేనట..!
ఒకరు కాల్పుల్లో స్పాట్ డెడ్
పలు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో ఒకటి కంటే ఎక్కువ క్యాలిబర్‌ల కాట్రిడ్జ్ షెల్‌లు లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 33 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారు పెన్ ప్రెస్బిటేరియన్ మెడికల్ సెంటర్‌లో మరణించారు. క్షతగాత్రులందరి పరిస్థితి నిలకడగా ఉంది. గాయపడిన వారిలో ఒక మహిళ కూడా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
సుమారు 25-30 కాట్రిడ్జ్ షెల్లు కనుగొనబడ్డాయి
ఘటనా స్థలంలో 25 నుంచి 30 క్యాట్రిడ్జ్ షెల్స్ లభ్యమైనట్లు ఇన్‌స్పెక్టర్ డీఎఫ్ పేస్ తెలిపారు. ఒక వ్యక్తి అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. దీంతో పలువురిపై బుల్లెట్ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారనే దానిపై ఇంకా సమాచారం అందలేదు. పోలీసులు నిందితులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులెవరూ ఇంకా అరెస్ట్ కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.