HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >18 Injured In Delta Airlines Crash At Toronto Pearson Airport No Fatalities Reported

Aircraft Crashed : ల్యాండ్ కాగానే విమానం బోల్తా.. 18 మందికి గాయాలు

అమెరికాలోని మిన్నె పొలిస్‌ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం(Aircraft Crashed) ఈ ప్రమాదానికి గురైంది.

  • By Pasha Published Date - 08:18 AM, Tue - 18 February 25
  • daily-hunt
Delta Airlines Crash Toronto Pearson Airport Canada

Aircraft Crashed : కారణం ఏమిటో తెలియదు కానీ.. విమానం ల్యాండ్‌ కాగానే, దానిపై పైలట్ అదుపు కోల్పోయాడు.  దీంతో అది రన్‌వే‌పై బోల్తా పడింది.  ఫలితంగా విమానంలోని 18 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాద ఘటన కెనడాలోని టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. అమెరికాలోని మిన్నె పొలిస్‌ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం(Aircraft Crashed) ఈ ప్రమాదానికి గురైంది. వెంటనే భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారికి ప్రస్తుతం చికిత్స జరుగుతోంది.

Also Read :Producer SKN : సరదాగా ఫ్లోలో అన్న మాటలకు వివాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

మొత్తం 80 మంది

ప్రమాదం బారినపడిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో టొరంటో పియర్‌సన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తాత్కాలికంగా విమానాల రాకపోకలను ఆపేశారు. ఈ ప్రమాదం కారణంగా 40కిపైగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరి ప్రాణాలకూ ముప్పు లేదని ఎయిర్‌పోర్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

#Update: Delta Airlines plane flips upside down in Toronto crash, 15 wounded.

◾Plane Carrying 80 passenger including 4 Crew flipping upside down on the tarmac at Pearson International Airport.#Toronto #PlaneCrashed #canada #DeltaAirlines #PlaneCrash #USA #Pearson #Minneapolis… pic.twitter.com/30hqAjquza

— DW Samachar (@dwsamachar) February 17, 2025

Also Read :TTD : ముంబైలో పద్మావతి అమ్మవారి ఆలయం కోసం భూమి కేటాయింపునకు టీటీడీ అభ్యర్థన

పెరిగిపోయిన విమాన ప్రమాదాలు

గత కొన్ని నెలలుగా వివిధ దేశాల పరిధిలో విమాన ప్రమాదాలు పెరిగిపోయాయి.  ప్రధానంగా బ్రెజిల్, అమెరికాలలో పెద్దసంఖ్యలో ఈ ఘటనలు జరిగాయి. ఈ కారణంతో విమానంలో ప్రయాణించాలంటేనే జనం జంకుతున్నారు. ఇక గత పది రోజుల్లో నాలుగు విమాన ప్రమాదాలు సంభవించాయి. ఈ వేర్వేరు ఘటనల్లో దాదాపు 80 మంది చనిపోయారు ఇటీవలే అమెరికాలోని ఆరిజోనా స్కాటేల్ విమానాశ్రయంలో రెండు ప్రైవేటు జెట్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలోో ఒక వ్యక్తి చనిపోయాడు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలను మరువకముందే కెనడాలో ల్యాండింగ్ సమయంలో విమానం బోల్తా పడటం ఆందోళనకరం.

Also Read :Mythri Movie Makers : టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు తమిళ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aircraft Crashed
  • canada
  • Delta Airlines
  • Delta Airlines Crash
  • Toronto Pearson airport

Related News

    Latest News

    • PTM-3.0 : ఏపీలో ఈరోజు మెగా PTM

    • Akhanda 2 Postponed : అఖండ 2 ఇక సంక్రాంతి కేనా..?

    • ‎Winter: చలికాలంలో కాఫీలు, టీలు ఎక్కువగా తాగుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ!

    • Winter Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి జ్యూస్ లు తీసుకోవాలో మీకు తెలుసా?

    • Health Tips: ‎గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే?

    Trending News

      • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

      • Putin Religion: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పాటించే మతం ఏమిటి? ఆయనకు దేవుడిపై విశ్వాసం ఉందా?

      • Putin Personal Toilet: పుతిన్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత టాయిలెట్.. ఎందుకంత పకడ్బందీ?

      • Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీమిండియా ఆట‌గాడు!!

      • India Squad: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భార‌త్ జ‌ట్టు ఇదే.. కెప్టెన్ ఎవ‌రంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd